గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సెకండ్ జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. మొదటి జాబితాలో 29మంది, రెండో జాబితాలో 16 డివిజన్ల అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
దీంతో పాటు మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఎన్నికల సమన్వయ కర్తలను ప్రకటించింది. మల్కాజిగిరి పరిధిలో సమన్వయకర్తగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి హర్కార వేణుగోపాల్ వ్యవహరించనుండగా శాసనసభ నియోజకవర్గాల వారీగా..ఉప్పల్‌కు సీతక్క, ఎల్బీనగర్‌కు పటేల్ రమే్‌షరెడ్డి, కవ్వంపల్లి సత్యనారాయణ, కూకట్‌పల్లికి బలరాం నాయక్, కుత్బుల్లాపూర్‌కు విజయ రమణారావు, సుభా్‌షరెడ్డి, మల్కాజిగిరికి మల్లు రవిని నియమించారు.
చేవెళ్ల లోక్‌సభ పరిధిలో మహేశ్వరానికి మల్‌రెడ్డి రంగారెడ్డి, శేరిలింగంపల్లి మధుయాష్కీగౌడ్, రాజేంద్రనగర్‌కు కేఎల్‌ఆర్ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తారు.