- Advertisement -
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మహాసంగ్రామానికి నేటితో తెరపడనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుండగా చివరి రోజు ప్రధాన పార్టీల నేతలు ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. డిసెంబర్ 1న పోలింగ్ జరగనుండగా 4న గ్రేటర్ ఫలితాలు వెలువడనున్నాయి.
ఇక టీఆర్ఎస్ నుండి మంత్రులు ప్రచారం చేయనుండగా బీజేపీ తరపున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాతబస్తీలో ప్రచారం నిర్వహించనున్నారు. అమిత్ షా రాక నేపథ్యంలో పాతబస్తీలో భారీగా కేంద్ర బలగాలను మోహరించారు. తొలుత భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తర్వాత అక్కడి నుంచి రోడ్ షో నిర్వహిస్తారు.
ఇవాళ సాయంత్రం 5 గంటల నుండి 1వ తేదీ వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. గ్రేటర్ పోలింగ్ నేపథ్యంలో ఎలాంటి హింసాత్మక సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు.
- Advertisement -