- Advertisement -
జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటువేసేందుకు అవకాశం ఉంటుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కోవిడ్ బాధితులతో పాటు సాధారణ ఓటర్లకు కూడా అవకాశం కల్పించారు. గ్రేటర్ పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్ ముగిసింది. ఓల్డ్ మలక్‌పేట్‌లో గుర్తులు తారుమారుతో పోలింగ్ రద్దు చేశారు.
ఎల్లుండి ఓల్డ్ మలక్‌పేట్‌లో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఎల్లండి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధం కొనసాగనుంది. డిసెంబర్ 4న బల్దియా ఎన్నికల ఫలితాలు రానున్నాయి. కాగా పోలింగ్ ఈ సారి మందకొడిగా సాగింది. మొత్తం 150 డివిజన్లలో కొన్ని స్థానాల్లో మాత్రమే పోలింగ్ 50 శాతం దాటింది. కొన్ని చోట్ల కనీసం పోలింగ్ 15 శాతం కూడా చేరకపోవడం గమనార్హం.
- Advertisement -