జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్ల ఆందోళన

9
- Advertisement -

జూబ్లిహిల్స్ ఉపఎన్నికను బై కాట్ చేసే ఆలోచనలో ఉన్నారు Ghmc కాంట్రాక్టర్లు. 2023 లో ఎన్నికల సమయంలో చేసిన పనులకు టెండర్లకు నిధులు ఇవ్వకపోవడం తో ఆందోళన బాటపట్టారు.

రాష్ట్రపతి, కేంద్ర ఎన్నికల సంఘం కు పిర్యాదు చేసిన తర్వాత ఫైల్ కదిలింది. బిల్లులు చెల్లించేందుకు ఎన్నికల అధికారులు అనుమతించిన అందుకు సంబంధించిన టోకెన్లు జనరెట్ చేయడం లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండు నెలలుగా ఎలక్షన్ అదనపు కమిషనర్ లాగిన్ లో దస్త్రం పెండింగ్‌లో ఉంది. ఈ ఉపఎన్నిక తర్వాత మరో అదనపు కమిషనర్ వస్తారు తనను అడగమని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు ఇప్పటికే సొంతంగా డబ్బులు చెల్లించుకొని వాటికి వడ్డీలు కడుతూ ఇబ్బందులు పడుతున్నామని … అధికారులు ఇలాగే వ్యవహరిస్తే జూబ్లిహిల్స్ పనులు నిలిపివేస్తామని హెచ్చరిక జారీ చేశారు.

Also Read:ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు:హైకోర్టు

- Advertisement -