మంచినీరు క‌లుషితం కాకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాలి..

311
- Advertisement -

జ‌ల‌మండ‌లి ఎండీ. ఎం. దాన‌కిషోర్, ఐఏఎస్ శుక్ర‌వారం ఖైర‌తాబాద్‌లోని జ‌ల‌మండ‌లి ప్ర‌ధాన కార్యాల‌యంలో ఓ అండ్ ఎమ్, ట్రాన్స్‌మిష‌న్, క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎండీ మాట్లాడుతూ.. వ‌ర్షాకాలం సీజ‌నల్ వ్యాధులు వ్యాపించే కాలం కాబ‌ట్టి మంచినీరు క‌లుషితం కాకుండా ఓ అండ్ ఎమ్ ట్రాన్స్‌మిష‌న్ అధికారులు జాగ్ర‌త్త ప‌డాల‌ని ఎండీ సూచించారు. అలాగే క్వాలిటీ కంట్రోల్ విభాగం అన్ని సెక్ష‌న్లలో మంచినీటి నమూనాల‌ను సేక‌రించి ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రీక్షలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. డివిజ‌న్ల‌ వారీగా క్వాలిటీ కంట్రోల్ రిపోర్టుల‌ను ఎండీ ప‌రిశీలించారు.

అలాగే బ‌స్తీ ప్రాంతాల్లో క‌లుషిత మంచినీరు రాకుంబా ఎలాంటి జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారో, వ‌స్తే ఎలా పరిష్క‌రిస్తారో ఎండీ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. భోల‌క్ పూర్ వంటి దుర్ఘ‌ట‌న మ‌ళ్లీ పురావృతం కాకుండా స‌మిష్టిగామంచినీటి నాణ్య‌త మీద దృష్టి సారించాల‌ని సూచించారు. అలాగే భోల‌క్‌పూర్ ప్రాంతాల్లో ప‌ర్య‌టించి మంచినీటి స‌ర‌ఫ‌రా, సెవ‌రేజీ, పొల్యూష‌న్, మంచినీటి నాణ్య‌త‌ ప‌రిస్థితుల మీద స‌మ‌గ్ర రిపోర్టు స‌మ‌ర్పించాల‌ని ఈడీ, సంబంధిత జీఎమ్‌ను ఆదేశించారు. వ‌ర్ష‌కాలం కాబ‌ట్టి సీజ‌న‌ల్ వ్యాధులు రాకుండా, మురికి వాడ‌ల్లో క్లోరిన్ మాత్ర‌ల‌ను పంపిణీ చేయాల‌ని ఎండీ అధికారుల‌కు సూచించారు.

GHMC Commissioner Dana Kishoreఅనంత‌రం వాక్ కార్య‌క్ర‌మం, ఎస్ హెచ్ ఎస్ హెచ్ కార్య‌క్ర‌మంపై స‌మీక్ష‌ నిర్వహించారు. న‌గ‌రంలోని 150 వార్డుల్లోని బ‌స్తీల్లో 2500 ఇళ్ల‌ల్లో నీటి వృథా ఆరిక‌ట్ట‌డం, మంచినీరు క‌లుషితం కాకుండా ఎన్జీవోలు, ఎస్ హెచ్ ఎస్ హెచ్ కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న తీసుకువ‌చ్చేందుకు ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అలాగే జీఎమ్, మేనేజ‌ర్లు వాట‌ర్ స‌ప్లైలో ముఖ్య పాత్ర పోషించే లైన్‌మెన్ల సాయంతో నీటి వృథా చేసే ప్రాంతాల‌ను గుర్తించి ప్ర‌త్యేక అవ‌గాహాన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని ఎండీ సూచించారు. ఈ అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టి వృథా అవుతున్న‌ప్ప‌టీ ఫోటోలు, వృథా ఆరిక‌ట్టిన త‌రువాత ఫోటోల‌తో రిపోర్టు అంద‌జేయాల‌ని తెలిపారు.

అలాగే ఈ కార్య‌క్ర‌మంలో నీటి వృథా ను ఆరిక‌ట్టే ప‌ద్ద‌తుల‌పై ప్ర‌ధానంగా చ‌ర్చించారు. ఇందులో ప్ర‌తి ఇంటికి న‌ల్లా త‌ప్ప‌నిస‌నరిగా ఉండే లాగా జ‌ల‌మండ‌లి డిస్ట్రిబ్యూష‌న్ పైపులు లీకేజీలు లేకుండా చూస్తే కొంత వ‌ర‌కు నీటివృథా ఆరిక‌ట్ట‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో జ‌ల‌మండ‌లి ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డా. ఎం. స‌త్య‌నారాయ‌ణ‌, ఆప‌రేష‌న్ డైరెక్ట‌ర్లు శ్రీ‌. అజ్మీరా కృష్ణ‌, శ్రీ‌. పి. ర‌వి, ప్రాజెక్టు డైరెక్ట‌ర్లు శ్రీ‌. ఎం. ఎల్లాస్వామి, శ్రీ‌. డి. శ్రీ‌ధ‌ర్ బాబు, రెవెన్యూ డైరెక్ట‌ర్ శ్రీ‌. వి.ఎల్. ప్ర‌వీణ్ కుమార్, టెక్నిక‌ల్ డైరెక్ట‌ర్ శ్రీ‌. బి. విజ‌య్ కుమార్ రెడ్డిల‌తో పాటు సంబంధిత సీజీఎమ్‌లు, జీఎమ్‌లు, ఎన్జీవోల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

- Advertisement -