మైత్రివనంలో భవనాలు తనిఖి చేసిన జీహెచ్ ఎంసీ కమిషనర్..

358
mythrivanam
- Advertisement -

అమిర్ పేట్ మైత్రివనంలో పర్యటించారు జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ . ఈ సందర్భంగా ఫైర్‌ సేఫ్టీలేని కోచింగ్‌ సెంటర్‌ భవనాల యజమానులపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైత్రివనం లో ఉన్న కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేసిన బ్యానర్లను వెంటనే తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదకరంగా ఉన్న బ్యానర్లు, బోర్డులు తీసేయాలని సూచించారు.

అగ్ని ప్రమాదం సంభవిస్తే పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం అవకాశం ఉందని తెలిపారు. కోచింగ్ సెంటర్లలో ఫైర్ సేప్టి లేనందున భవన యాజమానుల పై మండిపడ్డారు దాన కిషోర్.అన్ని కోచింగ్ సెంటర్లలో ఫైర్ సేఫ్టీ పై నివేదిక సమర్పించాలని జిహెచ్ఎంసి ఫైర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం డైరెక్టర్ ను ఆదేశించిన కమిషనర్ దాన కిషోర్.

- Advertisement -