బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న”ఘాజీ ”….

244
- Advertisement -

యుద్ధం అంటే దేశం కోసం ప్రాణాలు అర్పించడం కాదు, శత్రువు ప్రాణాలు తీసేయడమంటూ సబ్‌ మెరైన్‌ కథతో వచ్చాడు నటుడు ద‌గ్గుపాటి రానా. 1971 కాలంలో విశాఖపట్టణ తీరంలో భారతీయ నేవీకి, పాకిస్థాన్ నేవీకి మధ్య జరిగిన, ఎవరికీ తెలియని జలాంతర్గామి యుద్దం నేపథ్యంగా ఈ మూవీ తెరకెక్కింది. భారతీయ సినిమాల్లో వార్ డ్రామాలు చాలా తక్కువ. ముఖ్యంగా స్వతంత్ర పోరాట నేపథ్యంలో పలు చిత్రాలు తెరకెక్కినా.. పూర్తి స్థాయి వార్ డ్రామాగా సినిమాలు రాలేదు. ఆ లోటును తీరుస్తూ.. చరిత్ర కథల్లో పెద్దగా ప్రాచుర్యం పొందని ఓ సంఘటనను కళ్లకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేశారు చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి.
Ghazi Attack on box-office collections
ట్రైలర్‌, ఫస్ట్ లుక్‌, ప్రమోషన్స్‌తో బాగానే ఆకట్టుకున్న ఘాజీ ఈ నెల 17న విడుదలై ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈసినిమా చూసిన సినీ పెద్దలు రానాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రానా ఆన్ స్క్రీన్ పైనా.. ఆఫ్ స్క్రీన్ లోనూ.. కెప్టెన్ అండ్ క్రూ అదిరిపోయే పెర్ఫామెన్స్ చూపించాడటూ దర్శకధీరుడు రాజమౌళి తన ట్వీట్టర్‌ వేదికగా రానాను ప్రశంసించారు.

అయితే ఘాజీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మొదటి రోజు శుక్రవారం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూ. 4.25 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం వారాంతం శనివారం తొలి రోజు కంటే ఎక్కువుగా రూ. 5. 25 కోట్లు వసూలు చేసింది. దీంతో రెండు రోజులకు కలిపి మొత్తం రూ. 9.50 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఘాజీ హిందీ వర్షన్లో రెండు రోజుల‌కు అంచ‌నాల‌కు మించి రూ. 3.90 కోట్లు దక్కించుకోంది. విడుదలైన రెండు రోజలకే ఈసినిమా బాక్సాఫీస్‌ను రఫ్‌ ఆడిస్తుందని చెప్పుకొవచ్చు.
Ghazi Attack on box-office collections
ఇక ఓవ‌ర్సీస్‌లో కూడా ఘాజీ ఎక్కువ ప్ర‌భావం చూపుతోంది. తొలి రోజు అక్క‌డ $141,291 కలెక్ట్ చేసింది. ఇక దేశ‌వ్యాప్తంగా ఉన్న అన్నీ మల్టీఫ్లెక్సుల‌లోను ఘాజీ షోలు పెంచుతున్నారు. వ‌చ్చే శుక్ర‌వారం వ‌ర‌కు కొత్త సినిమాలేవి లేక‌పోవ‌డం కూడా సినిమాకు బాగా క‌లిసిరానుంది. పీవీపీ, మాటినీ ఎంటర్టైన్మెంట్స్ పతకంపై ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాలో రానా సరసన హీరోయిన్‌గా తాప్సీ నటించి మంచి మార్కులే కొట్టేసింది.

- Advertisement -