లైంగిక వేధింపుల కేసులో‘గజల్‌’ శ్రీనివాస్‌ అరెస్ట్‌..

243
- Advertisement -

లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన ప్రముఖ గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌కు నాంపల్లి కోర్టు ఈనెల 12 వరకు రిమాండ్‌ విధించింది. దీంతో ఆయన్ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో వైపు గజల్‌ శ్రీనివాస్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను నాంపల్లి కోర్టు తిరస్కరించింది.

ఈ కేసులో పక్కా ఆధారాలతోనే గజల్ శ్రీనివాస్‌ను అరెస్టు చేసినట్లు పంజాగుట్ట ఏసీపీ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఆలయవాణి వెబ్ రేడియోలో పని చేస్తున్న కుమారి అనే యువతి.. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆధారాలతో సహా డిసెంబర్ చివరి వారంలో తమకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వేధింపులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులోనే కుమారిపై శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

తన గదిలోకి యువతిని పిలిపించుకొని.. లొంగదీసుకునే ప్రయత్నం చేసినట్లు వీడియోల్లో స్పష్టంగా ఉందన్నారు. ఆమెతో మసాజ్ చేయించుకోవడం.. ఒంటి మీద బట్టలు లేకుండా ఉండమని చెప్పడం.. బలవంతంగా హగ్ చేసుకోవడం, ముద్దులు పెట్టడం, కాళ్లు ఒత్తిచ్చుకోవడం వంటి దృశ్యాలు వీడియోల్లో ఉన్నాయని ఏసీపీ తెలిపారు.   గజల్‌పై 354, 354ఏ, 509 సెక్షన్ ఐపీసీ కింద కేసులు నమోదు చేశామని ఏసీపీ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు.

అయితే గజల్ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అమ్మాయిని వేధించలేదని.. నా బిడ్డలా చూశానని చెప్పుకొచ్చారు.  ఎటువంటి దృష్టితో ఆమె ఫిర్యాదు చేసిందో. లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఫిర్యాదు చేసిందంటే ఆశ్చర్యం కలిగిందని తెలిపారు.

- Advertisement -