గురువారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 7వఅవతరణ దినోత్సవ కార్యక్రమం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ఘంటా చక్రపాణికి వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ సి.చంద్రయ్య,మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సోమేశ్ కుమార్ సీఎస్,ఘంటా చక్రపాణి,టీఎస్పీఎస్సి చైర్మన్, అల్లం నారాయణ, మీడియా అకాడమీ చైర్మన్,దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ సి.చంద్రయ్య మాట్లాడుతూ..ఒక ప్రభుత్వ ఉద్యోగి సక్రమంగా తన పనులు నిర్వహిస్తే వచ్చేటప్పుడు ఎలా ఉంటాదో తన పదవి విరమణ అప్పుడు అంతే గౌరవం ఉంటుంది. ఈ ఆరు సంవత్సరాలలో ఈ సంస్థ సక్రమంగా తమ బాధ్యతలు నిర్వహించింది. ఈ కమిషన్ తన సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేసింది. తెలంగాణ ఏర్పడ్డాక ఈ ఆరు సంవత్సరాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంస్థకి ఓ చైర్మన్ ని నియమించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ఘంటా చక్రపాణిని నియమించాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఆరేళ్ల తర్వాత సంతోషంగా ఉంటారని భావిస్తున్న..రాజ్యాంగబద్ధ మైన సంస్థల్లో ఈ సంస్థ ఒక్కటి. తెలంగాణ రాష్ట్రంలో ప్రప్రథమంగా ఏర్పడిన ఈ కమిషన్ చేసిన సేవలు అమోఘం. 50 వేల ఉద్యోగాల ప్రకటన నిరుద్యోగులకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు.
సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. నేను జిఎచెంసి కమిషనర్ గా ఉన్నపుడు ఘంటా చక్రపాణిని కలిసాను. డబుల్ బెడ్ రూమ్ విషయంపై సీఎంతో చర్చలో పాల్గొన్నప్పుడు ఘంటా చక్రపాణి కూడా అక్కడే ఉన్నారు. ఈ రోజు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల స్కిం దేశానికి ఆదర్శంగా అయింది. కొత్త సంస్థలో ఓ వ్యవస్థని తయారు చేయడం చలా కష్టం కానీ ఇక్కడ ఇది సాధ్యమైంది. ఆరూ సంవత్సరాలలో ఇన్ని ఉద్యోగాలు నియమించిన ఒక్క సమస్య కూడా ఏ పేపర్‌లో టివిలో చూడలేదు. ఇది సాధ్యం చేసినందుకి మీ టీమ్ అందరికి ప్రత్యేక అభినందనలు. దేశంలోనే ఈ కమిషన్ ని ఆదర్శంగా నిలిపారు. ఘంటా చక్రపాణి దేశానికి కూడా తన సేవలను అందించాలి. సీఎం కేసీఆర్ 50 వేల ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశించారు. ఏ ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైందన్నారు.
టీఎస్పీఎస్సి చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. అందరికి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 7వఅవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. మేము విజయం సాధించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం ,సహకారం మరువలేనిది. మా టీం ఎంతో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించింది. రాష్ట్రానికి సేవ చేసే అవకాశం లభించినందుకు సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు. నియామకాల్లో ఆరోజు ఎలాంటి రాజకీయలకు,అవకతవకలకు చోటు ఉండదని ఆరోజు చెప్పాను. దేశం మొత్తం మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు చూస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిబ్బందిని సీఎస్ సోమేశ్ కుమార్ అభినందించడం చాలా గొప్ప విషయం. కేవలం100 మంది ఎంప్లాయిస్ తో 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇంటికి వెళ్ళకుండా 36 గంటలు కంటిన్యూ గా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్న ఉద్యోగాలు పనిచేశారు. మీ అందరికి నేనున్నా అని భరోసా ఇస్తున్న. దేశం మొత్తం మనవైపు చూసే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందన్నారు.
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ.. ఘంటా చక్రపాణి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని పారదర్శకంగా నిర్వహించి దేశంలోనే అగ్రగామిగా నిలిపాడు. చక్రపాణి పదవి చేపట్టాక ఈ గెట్ లోకి రాజకీయ నాయకులకు ఎంట్రీ లేదు అన్నాడు ఈ రోజు వరకు కూడా అది అలాగే కొనసాగుతుంది. అభ్యర్థులు దరఖాస్తు మొదలు అపాయింట్మెంట్ వరకు అద్భుతంగా పని చేసారు. గతంలో ఏవిదంగా అవినీతి జరిగిందో మనకు తెలుసు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని బందుప్రీతి లేకుండా అద్భుతంగా నిర్వహించిన ఘనత టీఎస్పీఎస్సి కి దక్కుతుందని తెలిపారు.
దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డాక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు విశ్వసనీయ వ్యక్తి అవసరమని భవించినప్పుడు ముఖ్యమంత్రికి కనిపించిన మొదటి వ్యక్తి ఘంటా చక్రపాణి. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల నుండి కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమంలో మేధావి వర్గం సామాజికంగా కీలక పాత్ర పోషించారు. పబ్లిక్ కమిషన్ కి రాళ్ళెత్తిన మెస్త్రి ఘంటా చక్రపాణి. పబ్లిక్ కమిషన్ సిలబస్ రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణ చరిత్ర ఏ ఒక్క ఘటన కూడా మిస్ కాకుండా రూపొందించారు. పారదర్శకంగా కమిషన్ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల కమిషన్ కి ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పడ్డాక పారదర్శకంగా పనిచేసింది. దేశంలోనే అత్యుత్తమ కమిషన్ గా తీర్చిదిద్దారు.