‘గని’ ఫస్ట్‌ సింగిల్‌కు డేట్‌ ఫిక్స్‌..

93
Ghani
- Advertisement -

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ‘గని’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో వరుణ్‌కు జోడీగా సయీ మంజ్రేకర్ హీరోయిన్‌ కనిపించనుంది. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమైంది. అల్లు బాబీ – సిద్ధు ముద్ద ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా, డిసెంబర్ 3వ తేదీన విడుదల కానుంది. సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు.

తాజాగా ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ‘దే కాల్ హిమ్ గని .. కనివిని ఎరుగని’ అంటూ సాగుతోంది. ఫస్టు సింగిల్ ను రేపు ఉదయం 11:08 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ కూడా బాక్సింగ్ నేపథ్యంలో సాగేదిగానే అనిపిస్తోంది. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాల్లో శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -