- Advertisement -
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సీఎం ఇవాళ సాయంత్రం ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.
ఈసమావేశంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్ రావు, అరవింద్ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ సంసిద్దతను ఎన్నికల సంఘానికి తెలిజయేస్తామని వెల్లడించారు. ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారలను ఆదేశించారు సీఎం .
- Advertisement -