గణేష్‌ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు..

400
hyderabad ganesh
- Advertisement -

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిశోర్. 15 వేల మంది పోలీసులతో, 450 సీసీ కెమెరాలతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 23న గణేష్ నిమజ్జనం సందర్భంగా రూట్ మ్యాప్‌ను పరిశీలించారు.

నిమజ్జనానికి 150 క్రేన్లు ఉపయోగిస్తున్నామని చెప్పారు. 24 గంటలు,1600 మంది సిబ్బంది నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నారని చెప్పారు. స్ధానిక పోలీస్ స్టేషన్లతో పాటు జోనల్ కార్యాలయాలు సీపీ ఆఫీసులోని కమాండ్ కంట్రోల్‌కు సీసీ కెమెరాలు అనుసంధానం చేస్తామన్నారు.

70 వేల లైట్లను ప్రధాన రోడ్డుతో పాటు హుస్సేన్‌సాగర్ ఏర్పాటు చేస్తామన్నారు. అత్యవసరంగా 15 బొట్లు ,గత ఈతగాళ్లను అందుబాటులో ఉంటారని ప్రజలంతా ట్రాఫిక్ నిబంధనలకు సహకరించాలన్నారు.

- Advertisement -