- Advertisement -
ఇటలి ప్రధానిగా ఎన్నికయ్యారు జార్జియా మెలోని. నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీకి చెందిన అధినేత్రి జార్జియా మెలోని ఎన్నికల్లో విజయం సాధించారు. ఎన్నికల ఫలితాల సరళిని చూస్తే పార్లమెంటు ఉభయ సభల్లోనూ నేషనలిస్ట్ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీయే మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుంది. ఇటలీ ప్రధాని పీఠాన్ని తొలిసారిగా ఓ మహిళ అధిష్టించనున్నారు.
మనం ఆరంభ స్థాయిలోనే ఉన్నాం. రేపటి రోజు నుంచి మనం ఏంటో నిరూపించుకోవాల్సి ఉంది జార్జియా మెలోనీ అన్నారు. కొత్త ప్రధానికి ఎన్నో సవాళ్లు ఎదురు కానున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తర్వాత ఇంధన ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.
- Advertisement -