గ్రాండ్‌గా ‘జెంటిల్‌మన్ 2’ కంపోజింగ్

33
- Advertisement -

ప్రముఖ నిర్మాత “జెంటిల్‌మన్” కె.టి. కుంజుమోన్ అనేక బ్లాక్‌బస్టర్ సినిమాల ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో కీలక పాత్ర పోషించారు. ‘జెంటిల్‌మన్‌” సినిమా ద్వారా దర్శకుడు శంకర్‌ని పరిచయం చేసి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని క్రియేట్ చేశారు. 30 సంవత్సరాల తరువాత “జెంటిల్‌మన్ 2” పార్ట్ 2 ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.

ఎ. గోకుల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అకాడమీ అవార్డు గ్రహీత సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. కవిపేరరసు లిరిక్ రైటర్ వైరముత్తు సాహిత్యం అందిస్తుండగా అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ, తోట తరణి ఆర్ట్ వర్క్స్‌ని పర్యవేక్షిస్తున్నారు.

ప్రాజెక్ట్ మెటీరియలైజ్‌లో మొదటి దశగా, కె.టి. కుంజుమోన్ కొచ్చిలోని ప్రపంచ ప్రఖ్యాత బోల్గట్టి ప్యాలెస్ ఐలాండ్‌లో పాటల కంపోజింగ్ సెషన్‌ను నిర్వహించనున్నారు. ఎం.ఎం. కీరవాణి జూలై 19న కవిపేరరసు పాటల రచయిత వైరముత్తుతో కలిసి ఇక్కడికి చేరుకోనున్నారు.

Also Read:ఆలుతో కారు అద్దాలు క్లీన్!

ఈ ఇద్దరు దిగ్గజాలు కలసి గతంలో వరుస విజయాలు సాధించారు. కీరవాణి తమిళంలో చేసిన సేవగన్, వనమే ఎల్లై, జాతి మల్లి చిత్రాలలో అనేక విజయవంతమైన పాటలని అందించారు. దర్శకుడు గోకుల్ కృష్ణ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం ఈ జీనియస్ బృందంలో చేరుతున్నారు. బ్లాక్ బస్టర్ నిర్మాత కె.టి.కుంజుమోన్ అత్యంత భారీగా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక సిబ్బంది గురించిన వివరాలు త్వరలో తెలియజేస్తారు.

Also Read:BRS:మరోసారి మహారాష్ట్రకు కేసీఆర్

- Advertisement -