గురుకులాల్లో బర్త్ డే వేడుకలా?

3
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలను గురుకులాల్లో నిర్వహించడంపై మండి పడింది బీఆర్ఎస్‌వీ. రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలు అన్ని గురుకుల పాఠశాలల్లో అధికారికంగా నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పడాన్ని ఖండిస్తున్నామని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా పని చేసిన పొన్నం ప్రభాకర్‌కు నిబంధనలు తెలియవా? అని ప్రశ్నించారు.ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే గురుకుల పాఠశాలలకు పర్మినెంట్ బిల్డింగ్స్ కట్టాలన్నారు. గురుకుల పాఠశాలలకు ప్రభుత్వం నాసిరకం సరుకులు సరఫరా చేస్తున్నదని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి బర్త్ డే వేడుకలు గురుకుల పాఠశాలల్లో ఎందుకు చేయాలన్నారు. రాష్ట్రంలో అన్ని గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు దవాఖాన పాలు అవుతున్నారు. ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రివ్యూ చేయలేదని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురి అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అన్ని వ్యవస్థలను కుప్పకూలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:BRS:రేవంత్..మోకాళ్ల యాత్ర చేయాలి

- Advertisement -