ధమ్ బిర్యానీలా.. ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’

20
- Advertisement -

అందాల నటి అంజలి ‘గీతాంజలి’ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం “గీతాంజలి మళ్లీ వచ్చింది” చిత్రం మీద అందరి దృష్టి పడింది. ఈ చిత్రాన్ని శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. అంజలికి ఇది 50వ చిత్రం.దీంతో ఈ చిత్రం ఆమెకు ప్రత్యేకంగా మారింది. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా..

ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ మాట్లాడుతూ ‘‘అంజలిగారికి ముందుగా కంగ్రాట్స్ చెబుతున్నాను. ఈ సినిమా తర్వాత ఆమె 50 నుంచి డబుల్ సెంచరీ వరకు వెళ్లిపోతుంది. అలాగే కోనగారి స్టైల్లో తెరకెక్కిన గీతాంజలి. డైరెక్టర్ శివ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఇది టీమ్ అందరికీ కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది’’ అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది.. డబుల్ ఎంటర్‌టైనర్, డబుల్ హారర్ ఎలిమెంట్స్‌తో మెప్పిస్తుంది. చాలా రోజుల నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తున్నాను. అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉన్నాం. అంజలిగారి 50వ సినిమా అని స్పెషల్ సాంగ్ చేశాం. త్వరలోనే సినిమా విడుదలవుతుంది’’ అన్నారు.

చిత్ర దర్శకుడు శివ తుర్లపాటి మాట్లాడుతూ ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. సినిమా అంతకు మించి ఉంటుంది. అందరి సపోర్ట్‌తో ఇక్కడి వరకు చేరుకున్నాం. అంజలిగారికి ఇది 50వ సినిమా. ఆమెకు ఈ సందర్భంగా అభినందనలు. శీనన్న, రాజేషన్న, శంకర్, యాదంరాజు సహా అందరికీ థాంక్స్. ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్, ప్రవీణ్ లక్కరాజు మంచి మ్యూజిక్ తో పాటు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఏప్రిల్ 11న మూవీ రిలీజ్. సినిమా చూసి ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాం’’ అన్నారు.

షకలక శంకర్ మాట్లాడుతూ ‘‘ప్రవీణ్ లక్కరాజు చక్కటి సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. గీతాంజలి సినిమా వచ్చి పదేళ్లు అవుతుంది. ఆ సినిమా అందరి మనసుల్లో అలాగే ఉండిపోతుందనటంలో సందేహం లేదు. ఇప్పుడు గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు చాలా రిస్క్ చేశాం. ఏప్రిల్ 11న రాబోతున్న ఈ సినిమాను అందరూ పెద్ద సక్సెస్ చేయాలి. అంజలికి ఇది 50వ సినిమా. చాలా పెద్ద హిట్ చేసి ఆమెకు గుర్తుండిపోయేలా మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Also Read:KTR:కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు

- Advertisement -