అన్నింటికీ సమాధానం గీతాంజ‌లి 3లో ఉంటుంది!

14
- Advertisement -

అంజలి 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శక‌త్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. హారర్‌ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని ఏప్రిల్ 11న విడుదల చేశారు. సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి, త‌న గురించి, గీతాంజ‌లి 3 గురించి శివ తుర్ల‌పాటి మీడియాతో మాటా మంతీ…

* సినిమాకు వ‌స్తున్న స్పంద‌న గురించి చెప్పండి?
– రెస్పాన్స్ జెన్యుయ‌న్‌గా బావుంది. రివ్యూలను కూడా చూశాను. రివ్యూల్లో చెప్పే విష‌యాల‌ను నేనెప్పుడూ పాజిటివ్‌గా తీసుకుంటాను. సినిమాలో చాలా వాటికి ఆన్స‌ర్ చేయ‌కుండా వ‌దిలేశార‌ని కొంద‌రు రాశారు. అయితే, ఆ లాజిక్కుల‌న్నిటికీ స‌మాధానం చెబుతూ పోతే, యానిమ‌ల్ సినిమాలాగా మూడు గంట‌ల నిడివి వ‌స్తుంది. నేను చెప్ప‌ద‌ల‌చుకున్న‌ది అది కాదు. ఇది ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ సినిమా. కాంజూరింగ్ టైప్ హార‌ర్ ఇందులో చేయాల‌నే థాట్ మాకు లేదు. ఎంట‌ర్‌టైనింగ్ సినిమాగానే చేశాం. కోనగారి మార్కు రైటింగ్‌ని ఆస్వాదించేవారికి చాలా బాగా న‌చ్చుతోంది. సినిమా చూసిన వారు నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. వీకెండ్ కాబ‌ట్టి, యుఎస్‌లో ఇప్పుడు అంద‌రూ సినిమా చూస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది అక్క‌డి నుంచి. సునీల్‌, స‌త్య కామెడీ సెకండాఫ్ లో పేలింది. క్లైమాక్స్ ని కొంద‌రు ఎక్స్ ట్రార్డిన‌రీ అని మెచ్చుకుంటున్నారు. కొంద‌రు స‌డ‌న్‌గా పూర్త‌యింది అని అన్నారు. మ‌రికొంద‌రు అదేంట‌ని అన్నారు. ఇలాంటి అనుమానాలు అన్నిటికీ థ‌ర్డ్ పార్ట్ లో స‌మాధానం ఉంటుంది. ఈ విష‌యాల‌న్నిటినీ నేను కోన‌గారితోనూ డిస్క‌స్ చేశాను.

* పార్ట్ 2 చేస్తున్న‌ప్పుడే థ‌ర్డ్ చాప్ట‌ర్ గురించి అనుకున్నారా?
– పార్ట్ 2 చేస్తున్న లాస్ట్ మూమెంట్‌లో పార్ట్ 3 కోసం మంచి ఐడియా వ‌చ్చింది. అలా దాని గురించి ఓ డిస్క‌ష‌న్ జ‌రిగింది. దాని గురించి మ‌ళ్లీ మాట్లాడుదాం…
* పార్ట్ 3 అవ‌స‌రం ఉందా?
– పార్ట్ 2 లో పార్ట్ 3కి లీడ్ ఇచ్చాం. రావు ర‌మేష్ ఆత్మ‌ని అమ్మాయి బొమ్మ‌లో కేప్చ‌ర్ చేస్తుంది. అత‌ను వెళ్ల‌లేదు. ఆమెనే వెళ్లింది. తండ్రికోసం వ‌స్తాడు ఆ కొడుకు, ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు చ‌నిపోయాడు. అలాంట‌ప్పుడు అత‌నేం చేస్తాడు? ఈ పాయింట్ పార్ట్ 3లో అద్భుతంగా పేలుతుంది.
* మీరిందులో చిన్న కేమియో చేసిన‌ట్టున్నారు?
– నాకు న‌టించాల‌నే ఉద్దేశం లేదు. ఊటీలో కొంత‌మందిని ఆడిష‌న్ చేశాం. కానీ క‌రెక్ట్ ఆర్టిస్ట్ దొర‌క‌లేదు. అక్క‌డ మేం చాలా స్పీడ్‌గా షూటింగ్ చేశాం. ఎక్కువ టేకులు తీసుకునే వారిని మేం భ‌రించే సీన్ లేదు. డేట్లు, టైమింగ్‌… ఇలాంటివ‌న్నీ దృష్టిలో పెట్టుకుని టూరిస్ట్ కేర‌క్ట‌ర్ నేను చేస్తాను సార్‌ అని కోన‌గారికి మెసేజ్ పెట్టాను. బెస్ట్ అని రిప్లై ఇచ్చారు ఆయ‌న‌. అలా జ‌రిగిపోయింది అది. ఆ సినిమాలో న‌న్ను గుర్తించారు.. సంతోషం

ALso Read:రాజ్యాంగం ఎలా ఏర్పడిందో తెలుసా?

* డైర‌క్ట‌ర్‌గా శాటిస్‌ఫై అయ్యారా?
– శాటిస్‌ఫై అయ్యానండీ. ఇంకా బాగా చేసి ఉండొచ్చేమో అనే త‌ప‌న ఎప్పుడూ ఉంటుంది. కాక‌పోతే ఈ సినిమా నాకు చాలా చాలా నేర్పింది. నెక్స్ట్ సినిమాకు ఇంకా బాగా చేస్తానేమో.
* మోస్ట్ అన్ ఎక్స్ పెక్టెడ్ కాంప్లిమెంట్ ఎవ‌రి నుంచి వ‌చ్చింది?
– అంద‌రూ నా మంచిని కోరుకునేవారే. 20 – 25 ఏళ్ల నుంచి ఇండ‌స్ట్రీలో ఉన్నా. నా క‌ష్టాల‌ను ఎవ‌రూ చూడ‌లేదు. ఇప్పుడు చూస్తున్న శివ‌, ఆ శివ వేరు. అందుకే నేను స‌క్సెస్ కావాల‌ని అంద‌రూ కోరుకున్నారు.
* కోన‌గారి కోస‌మే సినిమా చేశారా? లేకుంటే డైర‌క్ష‌న్ చేయాల‌ని ముందే అనుకున్నారా?
– డైర‌క్ష‌న్ చేయాల‌న్న‌ది నా క‌ల‌. అందుకోస‌మే కోన‌గారికి కొన్ని స్క్రిప్టులు చెప్పా. ఈ సినిమాకు ముందు కూడా ఓ క‌థ చెప్పా. ఆయ‌న బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌ధ్య‌లో ర‌మ్మంటే నాకు కుద‌ర‌లేదు. కాక‌పోతే ఈ సినిమా డైర‌క్ష‌న్ నాకు ఇస్తార‌ని నేను ఊహించ‌లేదు. ఈ సినిమా చేస్తే లాంచ్ బావుంటుంద‌ని నాకు చెప్పారు. స‌రేన‌ని చేశాను.
* సీక్వెల్ అన‌గానే భ‌యం ఉంటుంది క‌దా…
– నిజ‌మేనండీ. ఫ‌స్ట్ పార్టు కూడా డైర‌క్ట‌ర్ బ్ల‌డ్ పెట్టి చేశారు. చాలా పెద్ద స‌క్సెస్ అయింది. అందుకే ఆ ప్రెజ‌ర్‌ని నేను తీసుకోలేదు. అలాగే అంజ‌లిగారికి 50వ సినిమా అని కూడా నాకు తెలియ‌దు. సినిమాను సినిమాగా చేశాం
* మీరు కొరియోగ్రాఫ‌ర్ క‌దా.. అది ఈ సినిమాకు ప్ల‌స్ అయిందా?
– బిగ్ టైమ్ ప్ల‌స్ అయింది. నేను చేసిన పాట‌లు చాలా మందికి తెలియ‌దు. నేను క‌నిపించ‌డానికి కూడా ఇష్ట‌ప‌డ‌ను కాబ‌ట్టి తెలిసే ఛాన్సే లేదు. తేజ‌గారి ద‌ర్శ‌క‌త్వంలో న‌వ‌దీప్ జైకి కొరియోగ్ర‌ఫీ చేశా. బ్ర‌హ్మాస్త్రం చేశా. శంక‌రాభ‌ర‌ణం చేశా… ఇంకా చాలా చాలా సినిమాలు… ప‌దివేల‌కు, ఐదు వేల‌కు సాంగ్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగులు నాకు పెద్ద‌గా రాలేదు. కానీ, నేను చేసిన ప్ర‌తి పాట‌లోనూ క‌థ చెప్పేవాడిని. కోన‌గారికి నాలో న‌చ్చిందే అది.
* అప్‌క‌మింగ్ సినిమాలు ఏమున్నాయి?
– చెప్తాను. నా ద‌గ్గ‌ర చాలా క‌థ‌లున్నాయి. నేను బాగా ఇష్ట‌ప‌డేది సెంటిమెంట్‌, ఎమోష‌న‌ల్ జోన‌ర్‌. ఏ సినిమా అయినా ఎమోష‌న్‌, సెంటిమెంట్ లేనిదే వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని నేను అనుకోను. సో.. ఇప్పుడు ఇమీడియేట్‌గా ఏది సెట్స్ మీద‌కు వెళ్తుందో చూడాలి.
* గీతాంజ‌లి3కి మీరే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా?
– ఇంకా తెలియ‌దండీ. కానీ, ఎవ‌రైనా త్వ‌ర‌లోనే మొద‌లవుతుంది.
* మీ గురించి చెప్పండి?
– చిన్నప్ప‌టి నుంచీ చిరంజీవిగారి సినిమాలు చూసి డ్యాన్సులు నేర్చుకున్నా. కోటిలో శ్రీను మాస్ట‌ర్ అని గురువుగారి ద‌గ్గ‌ర డ్యాన్సు నేర్చుకున్నా. అప్ప‌ట్లో ఆయ‌న బ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్ కార్డు ఇప్పించారు. బ‌ద్రిలోబ్యాక్ గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా ఫ‌స్ట్ టైమ్ చేశాను. రాకేష్ మాస్ట‌ర్‌, హ‌రీష్ మాస్ట‌ర్ ఎంక‌రేజ్ చేశారు. అప్పుడే తేజ‌గారు పిలిచి కొరియోగ్రాఫ‌ర్‌గా చేయ‌మ‌న్నారు. నేను డ్యాన్స్ మాస్ట‌ర్ కార్డు తెచ్చుకున్నా. మాస్ట‌ర్ అయ్యాక బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్స‌ర్‌గా చేయ‌డానికి లేదు. అప్పుడు త‌మిళ్ డ్యాన్స్ మాస్ట‌ర్ల హ‌వా ఉండేది. ఆ టైమ్‌లో నేను ముంబైకి వెళ్లా. అక్క‌డ డ్యాన్స‌ర్‌గా చేసుకోవ‌చ్చ‌నే వెళ్లా. భ‌రున్ ముఖ‌ర్జీ అని.. మ‌న వీయ‌స్ ఆర్ స్వామి గారికి గురువుగారున్నారు. ఆయ‌న్ని క‌లిశాను. ఆయ‌న‌తో ఏడు యాడ్ ఫిల్స్మ్ చేశా. ఆయ‌నరెమోసార్ ద‌గ్గ‌రికి పంపారు. ఆ త‌ర్వాత ఫైన‌ల్‌గా అమెరికాకి వెళ్లా. అప్పుడు నా గ‌ర్ల్ ఫ్రెండ్ అమెరికాలో ఉండేది. నాకూ వీసా రావ‌డంతో పెళ్లి చేసుకుని వెళ్లిపోయా. నేన‌లా వెళ్లానో లేదో… ఇలా స్టార్‌వార్‌, ఢీలు మొద‌ల‌య్యాయి. ఫిల్మ్ సిటీలో నేను నాలుగేళ్లు ప‌నిచేశా. కానీ అప్పుడు లేని షోలు.. ఇప్పుడు మొద‌ల‌య్యాయే అనిపించింది. కొన్నాళ్ల‌కు మ‌ళ్లీ నేను డ్యాన్స్ స్కూలు పెట్టుకున్నా. హైద‌రాబాద్‌లో సెటిల‌య్యా. మా డ్యాన్స్ఇన్‌స్టిట్యూట్‌లో ఇప్పుడు కూడా 500 – 600 మంది ఉన్నారు. నీ ఇంటికి ముందో గేటు.. అనే పాట‌కు మా స్టూడెంట్స్ తో క‌లిసే క‌వ‌ర్‌సాంగ్ చేశా. అస‌లు క‌వ‌ర్ సాంగ్స్ ఉంటాయ‌ని కూడా నాకు తెలియ‌దు. అది చూసి కోన‌గారికి న‌చ్చి మ‌ళ్లీ పిలిచారు. ఇలా ఇప్పుడు మీముందున్నా అన్నారు.

- Advertisement -