”గీత గోవిందం’ టీజర్ ఎప్పుడంటే..?

227
Geetha-Govindam
- Advertisement -

గీతా ఆర్ట్స్ బ్యానర్‏లో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ హీరోగా.. ఛలో ఫేం హీరోయిన్ రష్మీక నందన కథానాయికగా నటిస్తోన్న గీత గోవిందం మూవీని పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్, సాంగ్ ఇప్పటికే సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తిని పెంచుతున్నా యి. ఇంకేం ఇంకే కావాలే అంటూ విడుదలైన సాంగ్ కుర్రకారులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ తో కుర్రకారులను తనవైపు తిప్పుకున్నాడు విజయ్.

Geetha Govindam

 

తాజాగా సినిమా టీజర్ ఈ నెల 22న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఓ పోస్టర్‏ని విడుదల చేశారు. ఇందులో తన ప్రియురాలి.. బరువు బాధ్యతలు తనవే అంటూ సందేశం ఇచ్చేలా కథానాయికను ఎత్తుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా విజయ్.. ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాడు. టీజర్‏ని విడుదల చేసి సినిమాపై మరింత ఆసక్తి పెంచేందుకు గీత గోవిందం టీం సిద్దం అవుతోంది.

ఇక యూత్‏లో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ప్రత్యేకంగా ఆయన ఫ్యాన్స్ కోసం బట్టల బ్రాండ్‏ను ప్రారంభించారంటే.. విజయ్‏కి యూత్‏లో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ నుంచి వస్తోన్న మరో ప్రేమ కథా చిత్రం కావడంతో.. యూత్ ఆయన సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 15న విడుదల చేయనున్నారు.

- Advertisement -