ప్రభాస్ కోసం గీత గోవిందం దర్శకుడు

625
Parashuram And Prabhas
- Advertisement -

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో గీతా గోవిందం సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈమూవీ భారీ విజయాన్ని సాధించడంతో పాటు బాక్సాఫిస్ వద్ద భారీగా కలెక్షన్లను రాబట్టింది. యూత్ కు ఈసినిమా బాగా కనెక్ట్ అయింది. అలాగే విజయ్ కి దర్శకుడు పరశురామ్ కు మంచి సక్సెస్ ను ఇచ్చింది. ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ మరో లెవల్ కు వెళ్లింది. కానీ దర్శకుడు పరశురామ్ మాత్రం ఇంత వరకు తన తర్వాతి ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు.

అల్లు అరవింద్ నిర్మాణంలో ఓ పెద్ద హీరోతో పరశురామ్ సినిమా చేస్తాడని వార్తలు వచ్చినా అది పట్టాలెక్కలేదు. ఆయన తదుపరి సినిమా మహేశ్ బాబుతో ఉంటుందని కొన్ని రోజులు .. అఖిల్ తో ఉంటుందని కొన్నిరోజులు ప్రచారం జరిగింది. కానీ అవేవీ నిజం కాలేదు. తాజాగా ఆయన ప్రభాస్ కి కథ వినిపించడానికి సిద్ధమవుతున్నాడనేది ఫిల్మ్ నగర్ టాక్.

ప్రభాస్ కోసం పరశురామ్ మంచి కథను సిద్దం చేశాడట. ఒకటి రెండు రోజుల్లో ఆయనకి ఆ కథను వినిపించనున్నాడట. ప్రభాస్ కు కథ నచ్చితే తర్వాతి చిత్రం పరశురామ్ తో చేయనున్నాడు. గీతా గోవిందం లాంటి పెద్ద హిట్ వచ్చినా పరశురామ్ కి మాత్రం ఎవ్వరూ అవకాశం ఇవ్వడం లేదు. ప్రభాస్ అయినా ఆయనకు అవకాశం ఇస్తాడో లేదో చూడాలి మరి.

- Advertisement -