మంజిమా మోహన్ – గౌతమ్ కార్తిక్ జంట గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా వీళ్లు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రేమ పేరుతో ఈ జంట చెన్నై టు కేరళ మొత్తం చుట్టేశారు. ఆ మధ్య మాల్దీవుల పర్యటన కూడా చేసి వచ్చారు. దాంతో వీరిద్దరూ ఓ రేంజ్ లో వైరల్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ జంట పెళ్లిపై అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, వీరు మాత్రం తమ పెళ్లి సంగతులు ఎప్పుడూ బయటపెట్టలేదు. కానీ, సడెన్ గా ఈ జంట పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చింది.
ఈ రోజు మంజిమా మోహన్ – గౌతమ్ కార్తిక్ ఇద్దరూ తమ కుటుంబాల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని మంజిమా మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో అధికారికంగా తెలియజేస్తూ తన పెళ్లి ఫోటోలను కూడా పోస్ట్ చేసింది. చెన్నైలోని ఓ ప్రైవేట్ రీస్టార్ట్ లో ఈ రోజు ఉదయం వీరి వివాహాం జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంజిమా మోహన్ – గౌతమ్ కార్తిక్ పెళ్లి పిక్స్ వైరల్‌గా మారాయి.
ఇక మంజిమా మోహన్ – గౌతమ్ కార్తిక్ కొత్త ప్రయాణం ఆనందంగా సాగాలని పలువురు సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. పెళ్లి బట్టల్లో మంజిమా మోహన్ – గౌతమ్ కార్తిక్ చాలా అందంగా ఉన్నారు. ముఖ్యంగా మంజిమా మోహన్ తన భర్త గౌతమ్ కార్తిక్ వైపే చూస్తూ… సిగ్గుపడుతూ నవ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
ఇవి కూడా చదవండి..