గౌతమ్ నందకి అలా కలిసొచ్చింది..!

240
- Advertisement -

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న విడుదలకానుంది. ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందించారు.

కాగా గోపీచంద్ కి కొంతకాలంగా సక్సెస్ అనేది ముఖం చాటేస్తూ వస్తోంది. దాంతో ఆయన ఈ నెల 28వ తేదీన విడుదల కానున్న ‘గౌతమ్ నంద’ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు. అదే రోజున ‘నేనే రాజు నేనే మంత్రి’ .. ‘ నక్షత్రం’ .. ‘ విఐపి 2’ సినిమాలు ఉండటంతో, గోపీచంద్ కి కొంచెం టెన్షనే పట్టుకుంది. అయితే అనుకోకుండా ఆయనకి కలిసొచ్చింది.

Gautham Nanda for July Release

28వ తేదీన పోటీ ఎక్కువగా ఉండటంతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా ఆగస్టు 11కి వెళ్లిపోయింది. ‘నక్షత్రం’ సినిమా కూడా కొన్ని కారణాల వలన విడుదల తేదీని మార్చుకుంది. ఆగస్టు 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఇక ‘విఐపి 2’ సినిమా రిలీజ్ కూడా వాయిదా పడింది. మళ్లీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకుని ఎనౌన్స్ చేసే ఆలోచనలో వున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సోలోగా ‘గౌతమ్ నంద’ వస్తుండటం, గోపీచంద్ కి బాగా కలిసొచ్చే అంశమేనని చెప్పాలి. మరి ఈ సినిమాతో గోపీచంద్‌ సక్సెస్ సాధిస్తాడా..? లేదా..? వేచి చూడాలి.

- Advertisement -