16న…గౌతమ్ నంద ఆడియో

269
Gautham Nanda audio on July 16th
- Advertisement -

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ “గౌతమ్ నంద”. హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న విడుదలవుతుండగా.. ఎస్.ఎస్.తమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఆడియోను జూలై 16న హైద్రాబాద్ లోని జె.ఆర్.సి కన్వెక్షన్ సెంటర్ లో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్న వేడుకలో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాట్లాడుతూ.. “జూలై 28న సినిమా విడుదలకు అన్నీ సిద్ధం. ఇప్పటికే టీజర్-సాంగ్ ప్రోమోస్ కి విశేషమైన స్పందన లభిస్తోంది. తమన్ ట్రెండీ మ్యూజిక్ అందించారు, ఆడియో విడుదల వేడుకను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. గోపీచంద్ స్టైలిష్ లుక్స్, సంపత్ నంది స్టైలిష్ టేకింగ్, టీజర్ మరియు పోస్టర్ కు విశేషమైన స్పందన లభిస్తుండడంతో సినిమాను కూడా అంతకుమించిన స్థాయిలోనే ఆదరిస్తారనే నమ్మకం ఉంది” అన్నారు.

గోపీచంద్, హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!

- Advertisement -