మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వల్లే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఎగుమతి-దిగుమతి విధానం సరళీకరించినప్పుడే నా వ్యాపార ప్రస్థానం ముందుకు సాగడం ప్రారంభమైందని తెలిస్తే ఎంత మంది నమ్మగలరు? అన్నారు. అలా అని ఆయన నాకు వ్యక్తిగతంగా లబ్ది చేకూర్చారనడం సరికాదు. ఇక నా వ్యాపార ఎదుగదలలో రెండవ ధఫా 1991లో పీవీ నర్సింహారావు, మన్మోహన్ సింగ్ ద్వయం భారీ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించినప్పుడు. ఆ సమయంలో అనేక పారిశ్రామికవేత్తలు లబ్ది పొందారని చెప్పారు.
తాను, ప్రధానమంత్రి మోడీ ఒకే రాష్ట్రానికి చెందినవాళ్లం…. బహుశా అందుకే చాలా సులభంగా కొన్ని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. ఇలాంటి ఆరోపణలు రావడం నిజంగా దురదృష్టకరం. మా గ్రూప్ విజయాల్ని స్వల్పకాలిక దృష్టితో చూడడం వల్ల పక్షపాతంతో చేస్తున్న విమర్శలు ఇవన్నారు.
తన విజయాల వెనుక ఏ ఒక్క నాయకుడు లేడు.. అనేక మంది నాయకులతో పాటు ప్రభుత్వాలు ప్రారంభించిన విధానాల వల్ల, సంస్థాగత సంస్కరణల వల్ల ఈ స్థాయికి వచ్చాను.. మూడు దశాబ్దాల సుదీర్ఘ శ్రమ ఇది అన్నారు.
ఇవి కూడా చదవండి..