తెలుగు రాష్ట్రాల సీఎంలకు సినిమా చూపించబోతున్న..బాలయ్య

183
online news portal
- Advertisement -

నటసింహాం బాలయ్య నటిస్తున్న వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. కెరీర్ లో ఓ మైలు రాయిగా నిలిచే ఈ చిత్రాన్ని రెగ్యులర్‌ కమర్షియల్ మూవీలా కాకుండా,,చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే హిస్టారికల్ మూవీని ఎంచుకున్నాడు. భారతదేశాన్ని పాలించిన శాతవాహన రాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవితాన్ని,,,ఈ సినిమాతో తెరపై ఆవిష్కరించబోతున్నాడు. శాతవాహన సామ్రాజ్యానికి,,తెలుగు నేలకు దగ్గరి అనుబంధం ఉండడం..తెలుగు ప్రాంతం ఒక్క ఘన కీర్తీని ఇందులో చూపించబోతుండడంతో,,,రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఈ సినిమా చూపించేందుకు బాలయ్య ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతి బ‌రిలో నిలిచేందుకు రెడీ అవుతోన్న ఈ సినిమాని ఏపి సిఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఐదారు రోజుల ముందుగానే,,, జ‌న‌వ‌రి 3వ తేదీన ప్రత్యేక షో వేస్తున్నారు.

online news portal

డిసెంబర్ నెలలో రిలీజ్ కానున్న ఆడియోను ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదుగా,,,రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఆడియో వేడుక విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కొన్ని కీలక సన్నివేశాలు, పాటలు మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. నవంబర్ చివరి కల్లా మిగిలిన షూటింగ్ ను కూడా పూర్తీ చేసేపనిలో పడింది టీం యూనిట్. డిసెంబర్‌ కల్లా సినిమాను కంప్లీట్ చేసేలా దర్శకుడు క్రిష్‌ ప్రణాళికలు చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. హీరోయిన్‌గా శ్రియా ప్రధాన భూమిక పోషిస్తోంది. సినిమా ప్రారంభోత్సవాన్ని కూడా ఇద్దరు సీఎంల చేతుల మీదుగానే స్టార్ట్ చేశాడు బాలయ్య. టాలీవుడ్‌కు  ప్రెస్టీజియస్‌  ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ సినిమా కోసం  తెలుగు ప్రేక్షకులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

 

- Advertisement -