డ్రీమ్ గాళ్‌గా పేరు తెచ్చుకొన్న అలనాటి బాలీవుడ్ అందాల తార.. హేమామాలినీ ఇప్పుడు గౌతమి పుత్ర శాతకర్ణిలో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. గౌతమి పుత్ర శాతకర్ణి తల్లిగా హేమామాలినీ నటిస్తున్నారు. ఆదివారం హేమామాలినీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా గౌతమి బాలాశ్రీగా హేమామాలినీ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. గౌతమి పుత్ర శాతకర్ణిగా నందమూరి బాలకృష్ణ, వశిష్టి దేవి పాత్రలో శ్రియ శరన్ ఫస్ట్ లుక్‌లను చిత్రబృందం ఇది వరకే విడుదల చేసింది. దసరా సందర్భంగా విడుదల చేసిన గౌతమి పుత్ర టీజర్‌ని అనూహ్య స్పందన వచ్చింది. ఇప్పటి వరకూ ఈ టీజర్‌కి ఏకంగా రెండు మిలియన్ల హిట్స్ వచ్చాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
సమర్పణ : బిబో శ్రీనివాస్
కళా దర్శకుడు : భూపేష్ భూపతి
కెమెరా: జ్ఞానశేఖర్
సంగీతం : చిరంతన్ భట్
పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
మాటలు: సాయిమాధవ్ బుర్రా
ఫైట్స్ : రామ్ – లక్ష్మణ్
సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు
నిర్మాతలు: వై. రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు
దర్శకత్వం: క్రిష్
గౌతమి బాలాశ్రీ ఫస్ట్ లుక్
- Advertisement -
- Advertisement -