బాలయ్య కెరియర్ లో శాతకర్ణి టాప్..!

228
Gautamiputra Satakarni box office
- Advertisement -

యూఎస్ బాలయ్య శాతకర్ణి మూవీ దుమ్మురేపింది. బాలకృష్ణ గత సినిమాలకు మించిన కలెక్షన్లు శాతకర్ణిపై కురిసాయి. అమెరికాలో డిస్ట్రిబ్యూషన్ హక్కులను 9పీఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ.. రెడ్ హార్ట్స్ మూవీస్‌తో కలిసి 4 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమా ఇప్పటికే ప్రీమియర్ షోల ద్వారా సగానికి పైగానే కలెక్షన్లు సంపాదించి పెట్టిందని సమాచారం. రిలీజ్ రోజున 110 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు వేయగా.. 3 లక్షల 13 వేల 150 డాలర్ల కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Gautamiputra Satakarni box office

ఇంకా మరికొన్ని థియేటర్ల కలెక్షన్ల వివరాలు రావాల్సి ఉంది.మొత్త ఇప్పటివరకూ కేవలం ప్రీమియర్ షోలకే మీద 2కోట్ల 13 లక్షల 30వేల 212 రూపాయలు వచ్చాయన్న మాట. ఈ లెక్కన అతి తక్కువ వ్యవధిలోనే ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాటలో పడతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా గౌతమిపుత్ర శాతకర్ణి కలెక్షన్లు బాలయ్య సినిమాల్లోనే హయ్యస్ట్ అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బాలయ్య చివరి సినిమా డిక్టేటర్‌కు ప్రీమియర్ షోల ద్వారా 45వేల డాలర్లు వచ్చాయి. క్రిష్ చివరి మూవీ కంచె సినిమాకు ప్రీమియర్ షోల ద్వారా 53 వేల 57 డాలర్లు వసూలయ్యాయి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణికి 3 లక్షల 13వేల 150 డాలర్లు రావడం సరికొత్త రికార్డుగా మారింది.

- Advertisement -