రిటైర్మెంట్‌ ప్రకటించిన గంభీర్..

264
gautam gambhir
- Advertisement -

టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్‌ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. కొంతకాలంగా గంభీర్ రిటైర్మెంట్‌పై వార్తలు వస్తున్నప్పటికీ ఆయన ఖండిస్తూ వచ్చారు. కానీ ఇవాళ ట్విట్టర్ ద్వానా అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. ఎంతో కష్టంతో.. బరువెక్కిన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎప్పుడో ఒకప్పుడు రిటైర్ అవ్యాల్సిందేనని ఆ సమయం ఇప్పుడు వచ్చిందని తెలిపారు.

విజయ్ హజారే టోర్నిలో మెరుపులు మెరిపించిన గౌతీ తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమని అభిమానులు భావించారు కానీ వారి ఆశలపై నీళ్లు చల్లుతూ రిటైర్మెంట్ ప్రకటించారు. డ్యాషింగ్ అండ్ డేరింగ్ ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్న గంభీర్ ప్రత్యర్థికి బ్యాట్ తోనే కాకుండా.. మాటలతో కూడా గట్టిగా సమాధానమిచ్చాడు.

1999లో ఢిల్లీ తరపున రంజీల్లో ఆరంగేట్రం చేసిన గౌతీ…టీమిండియా రెండు ప్రపంచకప్‌లు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో తీవ్ర ఒత్తిడిలో 122 బంతుల్లో 97 పరుగులు సాధించాడు. 2009లో ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారం అందుకున్నాడు. భారత్‌ తరపున 58 టెస్ట్‌లు, 147 వన్డేలు, 37 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్ లో కొల్ కతా కెప్టెన్ గా రెండుసార్లు టైటిల్ ను అందించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌ జట్టులో కూడా గంభీర్ సభ్యుడు.

- Advertisement -