పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు..

38
- Advertisement -

సామాన్యులకు మరో షాకిచ్చింది కేంద్రం. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ. 350.50 పెంచేశాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానుండగా ధరల పెంపుపై సామాన్యులు భగ్గుమంటున్నారు.

గతేడాది జూలై 1న డొమెస్టిక్ సిలిండర్ ధరలు పెరిగాయి. మరోసారి.. ఎనిమిది నెలల తరువాత వీటి ధరలను పెట్రోలియం సంస్థలు భారీగా పెంచేశాయి. ధరల పెంపుతో హైదరాబాద్ లో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1,105 ఉంది. తాజా పెంపుతో నేటి నుంచి రూ. 1,155 పెరిగింది. అదేవిధంగా ఏపీలో ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1161 కి చేరింది.

ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధర ప్రస్తుతం రూ.1053 నుంచి రూ. 1103కు చేరింది. ముంబైలో రూ. 1052.50 నుంచి రూ. 1102.50కి పెరిగింది. ఈ ఏడాది కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలు పెరగడం ఇది రెండోసారి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -