గ్యాస్ సిలిండర్ ధర పెంపు..

20
- Advertisement -

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలను రూ. 209 పెంచాయి. ఈ ధరల పెంపు తక్షణమే అమలులోకి వస్తుందని చమురు కంపెనీలు తెలిపాయి.

వాణిజ్య,గృహ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ప్రతి నెల 1వతేదీన నెలవారీ సవరిస్తారు. గత నెలలో గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.158 మేరకు తగ్గించిన చమురు కంపెనీలు తాజాగా రూ.209 పెంచాయి.

పెరిగిన ధరలతో ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధర ఢిల్లీ నగరంలో రూ.1,731.50, ముంబైలో రూ. 1684, లక్నోలో రూ.1,845, చెన్నైలో రూ.1,898, బెంగళూరులో రూ. 1,813, కోల్‌కతా నగరంలో 1839రూపాయలుగా ఉంది.

Also Read:ఓటీటీలోకి విజయ్ ‘ఖుషి’!

- Advertisement -