సిలిండర్ బుకింగ్స్‌..కొత్త రూల్స్!

1
- Advertisement -

మీరు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? అయితే ఈ మార్పుల గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మరియు చమురు సంస్థలు గ్యాస్ బుకింగ్ నిబంధనల్లో భారీ మార్పులు చేస్తున్నాయి. ఈ కొత్త రూల్స్ మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.

కొత్త నిబంధనల ప్రకారం, పట్టణ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత రెండో సిలిండర్ బుక్ చేయడానికి మధ్య కనీసం 25 రోజుల గ్యాప్ ఉండాలి. గ్యాస్ కొరతను నివారించడానికి మరియు సక్రమ వినియోగాన్ని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా ఉన్న ఓటీపీ ఆధారిత డెలివరీని ఇకపై ప్రభుత్వం శాశ్వతం చేయనుంది. దీనివల్ల మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని చెబితేనే సిలిండర్ అందజేస్తారు. ఓటీపీ లేకపోతే డెలివరీ నిరాకరించే అవకాశం ఉంది. కాబట్టి మీ మొబైల్ నంబర్ అప్‌డేట్‌గా ఉందో లేదో సరిచూసుకోండి.

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయంగా సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారత్‌కు రోజుకు 80 వేల టన్నుల ఎల్పీజీ అవసరం కాగా, దేశీయ ఉత్పత్తి కేవలం 46 వేల టన్నులే ఉంది.ఈ లోటును పూడ్చేందుకు అమెరికా నుంచి గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ స్టాక్ జూన్ లేదా జూలై నాటికి అందుబాటులోకి రానుంది.

పరిస్థితులు సద్దుమణిగే వరకు కొత్త గ్యాస్ కనెక్షన్ల జారీని సుమారు ఒక నెల పాటు నిలిపివేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.సామాన్యులకు ఇది మరో షాకింగ్ వార్త. మే ప్రారంభం నుంచి వంటగ్యాస్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. ఏప్రిల్ 29న పశ్చిమ బెంగాల్ చివరి దశ పోలింగ్‌తో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

Also Read:సామాన్యురాలిలా కూరగాయలు కొన్న దీదీ!

సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన చమురు సంస్థలు ధరలను సమీక్షిస్తాయి. ఎన్నికలు ముగియగానే, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మే 1న ధరలు పెంచవచ్చని పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాబట్టి అనవసరంగా భయపడి స్టాక్ నిల్వ చేయవద్దు. ప్రభుత్వం సూచించిన కొత్త నిబంధనలను పాటిస్తూ మీ బుకింగ్స్ ప్లాన్ చేసుకోండి.

- Advertisement -