ఓ వైపు బెట్టింగ్ మరకలు…మరోవైపు వరుస పరాజయాలతో సతమతమవుతున్న భారత క్రికెట్‌ను సంక్షోభం నుండి గట్టెక్కించి గెలుపు రుచి చూపించిన కోచ్ గ్యారీ కిర్‌స్టన్.భారత్‌కు కపిల్ దేవ్ తర్వాత ప్రపంచకప్‌ని అందించిన సక్సెస్ ఫుల్ కోచ్‌గా పేరు తెచ్చుకున్న కిర్‌స్టన్…తాజాగా విరాట్ కోహ్లీకి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
విరాట్ నైపుణ్యాలు మరియు సామర్ధ్యం నన్ను బాగా ఆకట్టుకున్నాయి,కానీ బ్యాటింగ్ పరంగా అతను ఇంకా చాలా నేర్చుకోవలసి ఉందని గమనించి మేళకువలు నేర్పానని తెలిపాడు గ్యారీ.
శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతున్నప్పుడు జరిగిన ఘటన తాను ఎప్పటికీ మరచిపోలేనని తెలిపాడు. అందుకే తాను విరాట్‌కు మంచి సలహా ఇచ్చానని నువ్వు నీ ఆటని మరో స్థాయికి తీసుకెళ్లాలంటే.. బంతిని గాల్లోకి లేపకూడదు. బంతిని గ్రౌండ్ వెలుపలికి పంపే సామర్థ్యం నీలో ఉంది. కానీ.. ఆ షాట్ చాల రిస్క్‌తో కూడుకున్నది అని చెప్పా, ఆ తర్వాతి మ్యాచ్ లో విరాట్ తొలి శతకాన్ని చేశాడని తెలిపాడు.