ద్విభాష చిత్రంలో శ్రీవిష్ణు..!

231
sree vishnu
- Advertisement -

సినిమా సినిమాకి కొత్తదనాన్ని చూపిస్తూ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటోన్న నటుడు శ్రీవిష్ణు. నారా రోహిత్ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీవిష్ణు…హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

తాజాగా హ్యూమర్ బేస్ డ్ స్టోరీలో నటిస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం నివేధా థామస్- నివేధా పేథురాజ్ లను హీరోయిన్లుగా తీసుకుంటున్నట్లుగా సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

అప్పట్లో ఒకడుండేవాడు, మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకటే కథ వంటి చిత్రాలు నటుడిగా మంచి మార్కులు సంపాదించుకున్నాడు . అయితే రీసెంట్‌గా శ్రీవిష్ణు నటించిన తిప్పరా మీసం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు శ్రీవిష్ణు.

- Advertisement -