- Advertisement -
భారత క్రికెట్ కోచ్‌గా తాను ఏ విధంగా బాధ్యతలు చేపట్టానో కొద్దిరోజుల క్రితం వివరించిన మాజీ కోచ్ గ్యారీ క్రిస్టెన్ ..తాజాగా సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్‌కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. తాను కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన 2007లోనే సచిన్ రిటైర్ కావాలనుకున్నాడని వెల్లడించాడు.
సచిన్ 2007 లో 3 మరియు 4 వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు, ఆ సంవత్సరం తరువాత శాశ్వత ప్రాతిపదికన ఓపెనింగ్ స్లాట్‌కి తిరిగి వచ్చాడని తెలిపాడు. సచిన్‌తో తనకు గొప్ప కోచింగ్ ప్రయాణం ఉందని చెప్పిన గ్యారీ …తర్వాత 4 సంవత్సరాల్లో 19 సెంచరీలు చేశాడు.
తర్వాత టీమిండియా జట్టుగా రాణించడంతో 2011లో ప్రపంచకప్ గెలిచామని వెల్లడించాడు క్రిస్టెన్. క్రికెట్ హిస్టరీలో సెంచరీల సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు సచిన్. వన్డేల్లో 49 సెంచరీలు, టెస్టుల్లో 51 సెంచరీలు చేసి తన కెరీర్‌ని ఘనంగా ముగించాడు సచిన్.
- Advertisement -