ఇలా కోచ్‌ నయ్యా: గ్యారీ

306
gary kriston
- Advertisement -

గ్రేగ్ చాపెల్ ఎఫెక్ట్‌తో సంక్షోభంలో కూరుకుపోయిన టీమిండియాను గాడిలో పెట్టిన సక్సెస్ ఫుల్ కెప్టెన్ గ్యారీ క్రిస్టన్‌. టీమిండియాను ఒకేతాటిపైకి తేవడం,ప్రపంచకప్‌ సాధించడం,టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానం ఇలా భారత్‌ని విజయాల వైపు నడిపించాడు గ్యారీ.

ఈ నేపథ్యంలో భారత జట్టుకు తాను కోచ్‌గా ఎలా ఎంపికయ్యానో వివరించాడు గ్యారీ. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలోనే తనను కోచ్‌గా ఎంపికచేశారని ఇందుకు రవిశాస్త్రి, గవాస్కర్ ప్రధాన కారణమని తెలిపారు.

ఎలాంటి కోచింగ్‌ అనుభవం లేకపోవడంతో కాస్త సందేహం గానే ఇంటర్వ్యూ కోసం భారత్‌కు వెళ్లా అని కిర్‌స్టన్‌ చెప్పాడు. తాను కోచ్‌ పదవి కోసం ఇంటర్వ్యూకు వచ్చానని చెప్పడంతో అప్పటి టెస్టు జట్టు కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే నవ్వాడని అతడు గుర్తుచేసుకున్నాడు.

అయితే తాను అందుకున్న కాంట్రాక్టు పేపర్లలో గత కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేరుతో ఉండడంతో అతడి పేరును కొట్టేసి తన పేరును బీసీసీఐ కార్యదర్శి రాసిచ్చారని కిర్‌స్టన్‌ గుర్తు చేసుకున్నాడు.

- Advertisement -