వెల్లుల్లి మనం వంటింట్లో విరివిగా ఉపయోగించే పదార్థం. కూరల యొక్క రుచిని పెంచడంలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది వెల్లుల్లిని తినడానికి ఇష్టపడరు. దీనికి కారణం వెల్లుల్లిని.. నమిలినప్పుడు వచ్చే వాసన వల్ల కొంతమంది అలెర్జీగా ఫిల్ అవుతారు. కానీ వెల్లుల్లి తినడం వల్ల కలిగే ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేసే దివ్యఔశదం గా వెల్లుల్లిని భావిస్తారు ఆయుర్వేద నిపుణులు.
వెల్లుల్లి మెడిసినల్ గుణాలు పుష్కలం. అల్లిసిన్ ప్రధానంగా ఉంటుంది. ఇందులోని సల్ఫర్ కడుపు సమస్యలకు చెక్ పెడుతుంది. ప్రతిరోజు వెల్లుల్లి ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
పరగడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. పచ్చి వెల్లుల్లి తింటే ప్రయోజనాలు ఎక్కువ. ఇది శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సీజనల్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. జలుబు, దగ్గు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది. మన శరీరంలో విష పదార్థాలు బయటకు పోతాయి. అంతే కాదు వెల్లుల్లి ద్వారా జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తి పెంచుతుంది. తద్వారా మన శరీరం క్లెన్స్ అయిపోతుంది.
Also Read:డబ్బలిస్తేనే కాపురం చేస్తా..ఇదో వింత!