రాహుల్ తలే టార్గెట్.. గురి తప్పలేదు

229
rahulgandhi
- Advertisement -

వచ్చే నెలలో జరగనున్న కర్నాటక ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్శిస్తున్నాయి. నువ్వా నేనా అన్నట్టుగా ఇటు రాహుల్ అటు అమిత్ షా హోరాహోరిగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఓడిన వారికి ఘోర పరాభవం తప్పదు. కాంగ్రెస్ ఓడితే వచ్చే ఎన్నికల్లో గెలుపుకు నీళ్లు వదలాల్సిందే. మోడీ ఓడితే బీజేపీకి సీట్లు బాగా తగ్గిపోయే పరిస్థితి. ప్రతిపక్షాలు బాగా పుంజుకునే అవకాశం ఉంటుంది. మే 12న 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో కర్నాటక అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ తన రోడ్ షోలలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రచారంలోముందుకు దూసుకుపోతున్నారు.

Rahul-Gandhi-

ఇటీవల తుముకూరులో రాహుల్‌గాంధీ రోడ్‌షో నిర్వహిస్తుండగా ఓ అభిమాని రాహుల్ గాంధీని గురి చూసి ఆయన మెడలోకి పూల దండ విసిరే ప్రయత్నం చేశాడు. పూలదండను రాహుల్ గాంధీపై విసరగా అది నేరుగా ఆయన మెడలో పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా రాహుల్‌ తో పాటు అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ దృశ్యాలను కాంగ్రెస్‌ నేతలు సామాజిక మాధ్యమాల్లో పెట్టగా అవి వైరల్‌గా మారాయి. ఈ దృశ్యాలను కొందరు మెచ్చుకున్నప్పటికి మరికొందరు రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ అభిమానిని భద్రతా అధికారులు అదుపులోకి తీసుకునిప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.

https://twitter.com/bkrs100/status/981553988410617862

- Advertisement -