ఐపీఎల్ వేడుకలకు పరిణీతి డుమ్మా…

248
After Ranveer Singh, Parineeti Chopra Pulls Out of Opening Ceremony
- Advertisement -

రేపు ముంబై వాఖండే స్టేడియంలో కలర్ ఫుల్ జోష్‎తో ప్రారంభం కానున్న ఐపీఎల్ ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టనున్న బాలివుడు నటి పరిణీతి చోప్రా. ఇలాంటి కార్యక్రమాలకు అవకాశం దొరకడమే గొప్పగా భావిస్తుంటారు. కానీ పరిణీతి చోప్రా మాత్రం ఆరంభ వేడుకలకు ఇంకా సన్నద్ధంకాలేదని తప్పుకుంది. పరిణీతి ప్రతినిధి దీనిపై వివరణ ఇచ్చారు. పాటియాలలో నాన్ స్టాప్‎గా జరుగుతున్న నమస్తే ఇంగ్లాండ్ సినిమా షూటింగ్‎లో పరిణీతి బీజీ ఉన్నారన్నారు. ఐపీఎల్ వేడుకలలో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ఆమెకు తగినంత సమయం కుదరడంలేదని పేర్కొన్నారు.

After Ranveer Singh, Parineeti Chopra Pulls Out of Opening Ceremony

మరోవైపు పుట్‎బాల్ ఆడుతూ గాయపడిన రణ్‎వీర్‎సింగ్ కూడా వేడుకల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. వేడుకలలో హై ఎనర్జీ లెవల్స్‎తో డ్యాన్స్ చేస్తే గాయం తీవ్రత ఎక్కువతుందనే తప్పుకున్నట్లు రణ్‎వీర్ వెల్లడించారు. రణ్‎వీర్ స్థానంలో హృతిక్ రోషన్ రోషన్ స్టేజ్‎షో చేసేలా బీసీసీఐ ప్రతినిధులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరీ రేపు సాయంత్రం ప్రారంభం కానున్న వేడుకలకు పరిణీతి చోప్రా స్థానంలో ఎవరినీ ఎంపికచేస్తారనేది ఆసక్తిదాయకంగా మారింది.

- Advertisement -