కృష్ణాజిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదివికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలిపారు. ఈమేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓ లేఖను కూడా పంపించారు. తనను, తన క్యాడర్‌ను వైఎస్సార్సీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. తనను నమ్ముకున్న వారిని కాపాడుకునేందుకే పార్టీకి, శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కాగా వంశీ పార్టీ మారతారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇటివలే బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదిరిని కలిశారు. అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్ కూడా కలిశారు. జగన్ తో 40నిముషాల పాటు సమావేశం అయ్యారు. ఇక వంశీ వైసీపీలో చేరతారని అనుకున్నారు. కానీ ఆయన పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు తెలిపారు. వంశీ జూనియర్ ఎంటీఆర్‌కు సన్నిహితుడన్న విషయం అందరికీ తెలిసిందే. వంశీ రాజీనామా టీడీపీకి గట్టి దెబ్బె అని చెప్పుకోవాలి. 23మంది ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య కాస్త 22కు చేరుకుంది. ఇక వల్లభనేని వంశీ తర్వాతి నిర్ణయం ఏంటో అన్నది చూడాలి.