భారత మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ తన ఐపీఎల్ ఫాంటసీ లీగ్ కలల జట్టును ప్రకటించాడు. ‘ఎంతో ఆలోచించి, కీలక మార్పుల ద్వారా తన ఐపీఎల్ ఫాంటసీ డ్రీమ్ టీమ్‌ను ప్రకటిస్తున్నా’ అని గంగూలీ పేర్కొన్న గంగూలీ ఈ జట్టులో ధోనీకి చోటు కల్పించలేదు. ధోనీ స్థానంలో దిల్లీ డేర్‌డెవిల్స్ యువ ఆటగాడు రిషబ్ పంత్‌కు గంగూలీ వికెట్‌కీపర్ బాధ్యతలు అందించాడు. 11మంది సభ్యుల జట్టులో నలుగురు విదేశీయులకు గంగూలీ చోటు కల్పించాడు.
గంగూలీ డ్రీమ్ టీం..
విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్, డివిలియర్స్, నితీశ్ రాణా, మనీశ్ పాండే, రిషబ్ పంత్, సునీల్ నరైన్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, క్రిస్ మోరిస్.
గతంలో కూడా ధోనీపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కెరీర్లో సక్సెస్ఫుల్ కెప్టెన్‌గా కొనసాగిన మహీ ఐపీఎల్లో సరైన ఫాం లేకుండా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధోని టీ20లకు పనికిరాడని గంగూలీ వ్యాఖ్యానించాడు. వన్డేల్లో అతను ఛాంపియనే కానీ.. టీ20ల విషయానికొస్తే గత పదేళ్లలో అతను కేవలం ఒకే ఒక్క అర్ధశతకం సాధించాడు. ఇదేమంత గొప్ప రికార్డు కాదు’’ అన్నాడు.
అంతేగాదు ప్రస్తుత ధోని ఫామ్ ను బట్టి తనైతే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయను అని ఈ మాజీ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ధోని ఆటతీరుపై పుణే జట్టు యాజమాన్యం సైతం విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.