ఏపీ సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ..

371
jagan chiru

ఏపీ సీఎం జగన్‌తో మెగాస్టార్ చిరంజీవి ఇవాళ భేటీ కానున్నారు. తాడేపల్లి గూడెంలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం జరిగే ఈ భేటీలో సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని కోరనున్నారు. ఏపీలో సైరా చిత్రానికి స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చినందుకు కృతఙ్ఞతలు తెలపనున్నారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఆయన్ని చిరు కలవనుండటం ఇదే తొలిసారి.

ఈనెల 5న తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌ను చిరం‍జీవి మర్యాదపూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని ఆమెను చిరంజీవి కోరారు. చిరంజీవి ఆహ్వానం మేరకు గవర్నర్‌ ప్రత్యేకంగా ఈ సినిమాను వీక్షించారు.

తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ ఆధారంగా తెరకెక్కింది సైరా. అక్టోబర్ 2న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో భారీ వసూళ్లు సాధించింది.