యాసంగి ధాన్యం కొనేవరకు ఉద్యమిస్తాం:గంగుల

61
gangula
- Advertisement -

కరీంనగర్ జిల్లాలో రైతు ధర్నాలు చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు మంత్రి గంగుల కమలాకర్. బుదవారం జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇంచార్జులతో కరీంనగర్లో సన్నాహక సమావేశం నిర్వహించిన అనంతరం మంత్రి మిడియాతో మాట్లాడారు, కరీంనగర్ నియోజకవర్గంలో కలెక్టరేట్ ముందు, చొప్పదండి కానిస్టెన్సీ గంగాదరలో, మానకొండూరు పట్టణంలో, హుజురాబాద్ ఆర్డీవో కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులతో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా, కేంద్రంపై ఒత్తిడి పెంచే విదంగా దర్నాలు నిర్వహిస్తామన్నారు మంత్రి గంగుల. శుక్రవారం రోజు ఉదయం పదిగంటల నుండి మద్నాహ్నం ఒంటి గంట వరకూ రైతులతో కలిసి ఆయా ప్రాంతాల్లో రైతు దర్నాలు చేయాలని శ్రేణులకు, రైతులకు పిలుపునిచ్చారు మంత్రి గంగుల. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ గారి రైతు అనుకూల విదానాలతో ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్నామని, కొత్త రాష్ట్రంలో 24గంటల ఉచిత కరెంటు, బ్రహ్మండంగా సాగు, తాగునీరు, రైతులకు పెట్టుబడి కోసం రైతుబందు వంటి మెకానిజాన్ని ఏర్పాటు చేసుకొని వారి ఆర్థిక బాదల్నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న దశలో కేంద్ర ప్రభుత్వానికి కడుపు, కళ్లమంటగా తెలంగాణ ప్రభుత్వంపై రైతాంగంపై కుట్రలు చేస్తూ ఇబ్బందులు పెడుతుందన్నారు, ఈ నిరంకుశ అన్యాయ విదానాల్ని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాక నిరసనలు కొనసాగుతాయన్నారు మంత్రి గంగుల. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండి కూడా దర్నాలు చేసే పరిస్థితిని కల్పించిన కేంద్ర అసమర్థ విదానాల్ని ఎండగట్టారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓకరకంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని, రాష్ట్రం ఏం చెబుతుందో కిషన్ రెడ్డి చెబుతుంటే బండి సంజయ్ తప్పుపడుతున్నారని ఈ గందరగోళం తొలగించి ప్రజలకు, రైతులకు నిజాల్ని స్పష్టంగా తెలియజేయాలనే రైతు దర్నాలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి గంగుల. యాసంగి, వానాకాలం పంటలపై ఇష్టారీతిగా మాట్లాడుతున్నారన్నారు.

బాబాసాహేబ్ అంబేద్కర్ గారు వ్యవసాయ చట్టాల్ని రూపొందించి, పంటల్ని కొనుగోలు చేసే బాధ్యతను కేంద్రానికే ఇచ్చారన్నారు మంత్రి గంగుల. తద్వారా ఏ రాష్ట్రానికి ఎమ్మెస్పీ నిర్ణయించే అధికారం, కొనుగోలు చేసి నిల్వ చేసే ఎఫ్.సి.ఐ లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసే అదికారం, స్వంతంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొని నిల్వ చేసి ఎగుమతి చేసే అదికారం, సైంటిఫిక్ గోదాముల్ని నిర్వహించే అధికారం లేదన్నారు, రైతుల పంట కేంద్రం కొనడం బిక్ష కాదని ప్రజాస్వామ్యబద్దంగా రైతుల హక్కని అన్నారు మంత్రి గంగుల. రాష్ట్రానికి వందకిలోల బియ్యాన్ని కూడా స్టోర్ చేసే అధికారం, ఎక్స్ పోర్ట్ చేసే అధికారం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిది పంటకు అవసరమైన నీరు, కరెంటు, పెట్టుబడి వంటి వనరుల్ని అందించే అధికారం మాత్రమే ఉందన్నారు, గతంలో లేవీ విదానం ఉన్నప్పుడు కేంద్రమే వరి పండించండి అని ప్రోత్సహించిందని తద్వారా వరి పంట సాగు క్రమంగా అలవాటైందన్నారు మంత్రి గంగుల, వానాకాలం, యాసంగి పంటల ఔటర్న్ వేరు వేరు విదంగా ఉందని, ఉష్ణోగ్రత తక్కువ వల్ల వానాకాలంలో కోసి మిల్లింగ్ చేస్తే ఔటర్న్ 100 కిలోలలకు 68 కిలోలు వస్తుందన్నారు,  ఇబ్బంది లేదన్నారు, కానీ యాసంగిలో గింజ పాల దశకు వచ్చేటప్పుడు మనదగ్గరున్న ఉష్ణోగ్రతల వల్ల గింజలో పగుల్లు వస్తాయని, అవి మిల్లింగ్ చేసినప్పుడు పెద్ద సంఖ్యలో నూకలుగా విరిగిపోతాయన్నారు. ఈ పరిస్థితుల్లో విరిగిపోకుండా ఉండేందుకు బాయిల్డ్ చేసి మిల్లింగ్ చేస్తేనే ఎఫ్.సి.ఐ నిర్ణయించిన ఔటర్న్ 67 కిలోలుగా వస్తాయన్నారు మంత్రి, అయితే ఈ బాయిల్డ్ రైస్ ఒకసారి ఉడకడం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేస్తే పాడైపోతాయని యాసంగిం పంటను ఎక్కువగా తీసుకోమని కేంద్రం చెప్తుందన్నారు, ఈ నిజాన్ని మరిచి బండి సంజయ్ అవాకులు చెవాకులు పేలుతున్నారన్నారు.

కేటీఆర్ గారితో కలిసి సెప్టెంబర్లో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ని కలిసి పంట వేసి కోతలు జరిగి దాదాపు 20వేల కోట్లతో యాసంగి ధాన్యం  50లక్షలమెట్రిక్ టన్నులు బియ్యం సేకరించిన తర్వాత కేంద్రం తీసుకోమని అనడం అన్యాయమని వివరిస్తే, ఖరాఖండిగా 20 లక్షల మెట్రిక్ టన్నులకు మించి కొనమని చావుకబురు చల్లగా చెప్పారని దుయ్యబట్టారు,  వ్యవసాయ దేశంలో రైతులకు న్యాయం చేయాలని, వారి పంటల్ని లాబనష్టాల కోణంలో చూడొద్దని చెప్పినా, 4ఏళ్ల నిల్వలు ఉన్నాయని డాక్యుమెంట్ రూపంలో పారాబాయిల్డ్ కొనమని పంపించారన్నారు, యాసంగిలో వచ్చేది కేవలం పారాబాయిల్డే అని తెలిసినా కేంద్రం ఇలా చెప్పిందన్నారు. ఇది అన్యాయమని సాక్షాత్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రం నుండి జీఎస్టీ తీసుకొని ఎందుకు కొనరని ప్రశ్నించారు, పంజాబ్లో కొని ఇక్కడ ఎందుకు కొనరని తెలంగాణ రైతుల పంట కొనాలని కోరారన్నారు. దీనిపై కేంద్రం స్పందన శూన్యమన్నారు మంత్రి గంగుల.  ఐతే దీనికి విరుద్దంగా బండి సంజయ్ రైతులు మునిగే విదంగా వరి వేయమంటున్నాడని, ఇదే మాట లిఖిత పూర్వకంగా కేంద్రం ప్రభుత్వం నుండి ఇప్పించాలన్నారు, ఈ స్పష్టత కోసమే శుక్రవారం దర్నా చేస్తున్నామని, బీజేపీ నేతలు సైతం తెలంగాణ రైతాంగానికి మేలు చేసేవిదంగా ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ఇంటి ముందు దర్నా చేయాలన్నారు, తెలంగాణలో నీళ్లు, పంటలు బాగున్నాయని రైతులు పండించిన పంటను ఎమ్మెస్పీతో కొనాలని ఆర్డర్ తీసుకురావాలని చెప్పారు, ఈ కార్యాచరణ లేకుండా సూటిగా సమాదానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం సరైన చర్య కాదన్నారు. 

గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రైతులు సంతోషంగా ఉండాలని, రైతుబందు, 24గంటల నీరు, ఎరువులు అందుబాటులో ఉంచారని, కానీ కేంద్ర విదానాల వలన రైతులు మునుగుతున్నారని దీనిపై రైతులంతా సంఘటితమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు, జిల్లా కలెక్టర్కి సైతం ఎన్నికల నియమావళిని అనుసరించి, కోవిడ్ నిబందనలు పాటించి దర్నాలు నిర్వహిస్తామని పర్మిషన్ కోసం కోరామన్నారు మంత్రి గంగుల.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రసమయి భాలకిషన్, సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసులక్ష్మణ్ రావు, టీఆర్ఎస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -