గంగమ్మ కాదు గంగే…

360
Ganga And Yamuna Are Not Living Entities Says SC
- Advertisement -

పవిత్ర గంగా, యమున నదులు ప్రాణమున్న జీవులు కాదని సుప్రీం కోర్టు స్ఫష్టం చేసింది. మనుషులకు వర్తించే న్యాయపరమైన హక్కులు జీవనదులైన గంగా, యమునలకు కూడా చెల్లుతాయని  ఉత్తరాఖండ్‌ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం  గంగా, య‌మునా న‌దుల వ‌ల్ల మాన‌వ‌జాతి వ‌ర్థిల్లుతున్న‌ద‌న్న విష‌యం వాస్త‌వ‌మే అని, కానీ స‌మాజంలో న‌దుల ప‌ట్ల ఉన్న విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని వాటిని జీవం ఉన్న వ్య‌క్తులుగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని  పేర్కొన్న‌ది.

ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ మధ్య ఆస్తులు, అప్పుల పంపకాల గురించి ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు గంగ, యమున నదులు కేవలం నీటి ప్రవాహాలు కాదని  హిందువుల భక్తి, శ్రద్దలకి మూలమైనవని..గంగ, యమున నదులు న్యాయస్థానం ముందు వ్యక్తులుగా అస్థిత్వం కలిగి ఉంటాయని సంచలన తీర్పు వెలువరించింది.

Ganga And Yamuna Are Not Living Entities Says SC
ప్రస్తుతం ఉత్తర భారతదేశానికి జీవనాడుల్లాంటి గంగా, యమునా నదులు తీవ్ర ప్రమాదంలో వున్నాయి. తీరం వెంబడి నివసించే జనం నిర్లక్ష్యం, లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల విశృంఖలత్వం, కలుషితాల్ని ప్రవాహాల్లో కలిపేసే కర్మాగారాలు… అన్నీ కలిసి ఆ జీవనదుల జీవాన్ని హరించేస్తున్నాయి. వాటి బ్రతికే హక్కుని హరించేసి గంగా, యమునల అంతానికి ఆరంభం పలికేశాయి! ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం చాలా రోజులుగా గంగా, యమునా రక్షణకి నడుం బిగించింది. కాని, మొన్నటి వరకూ యూపీలో, ఉత్తరాఖండ్ లో బీజేపి ప్రత్యర్థి పార్టీలు అధికారంలో వుండటంతో గంగా మ్యానేజ్ మెంట్ బోర్డ్ ఏర్పాటు కుదరలేదు. దీనిపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలోనే నదుల సంరక్షణకి బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించింది.

దీంతో ‘నమామి గంగా’ డైరెక్టర్‌ కూడా అయిన ఉత్తరాఖండ్‌ చీఫ్‌ సెక్రటరీ, ఆ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌లను ఆ రెండు నదులకూ తల్లిదండ్రులుగా నియమించింది. గంగ, యమున నదులకు సంబంధించిన చట్టబద్ధమైన విధులు అన్నిటినీ ఈ ఇద్దరే చేపడతారని స్పష్టం చేసింది. గంగఈ మేరకు జస్టిస్‌ అలోక్‌ సింగ్‌, జస్టిస్‌ రాజీవ్‌ శర్మలతో కూడిన హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. పరమ పవిత్రమైన నదులుగా తమకున్న విలువను గంగా, యమున కోల్పోతున్నాయని, ఆ రెండు నదులనూ పరిరక్షించడానికి, సమాజంలో వాటిపై ఉన్న విశ్వాసాన్ని కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.

అయితే యూపీ కోర్టు  ఇచ్చిన ఉత్తర్వులను  అంగీకరించని సుప్రీం  గంగ,యమున నదులేనని అస్ధిత్వం కలిగిన వ్యక్తులుగా గుర్తించబడవని తేల్చి చెప్పింది.

- Advertisement -