- Advertisement -
ఇప్పటి వరకూ దాదాపు లక్షన్నరకు పైగా గణనాథులను నిమజ్జనం చేశారు అని తెలిపారు మేయర్ విజయలక్ష్మి. ట్యాంక్ బండ్ వద్ద దాదాపు లక్ష విగ్రహాలను నిమజ్జనం చేశామని వెల్లడించారు.
నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్, చెరువుల్లో 56 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి అన్నారు. హుస్సేన్ సాగర్ వద్ద 24/7 శానిటేషన్ పనులు చేపట్టాం అని.. రేపటి నిమజ్జన వేడుకలు ప్రశాంతమైన వాతావారణంలో జరిగేలా ఏర్పాట్లు చేశాం అన్నారు.
Also Read:TTD:అనంత పద్మనాభ వ్రతం
అన్ని శాఖల సమన్వయంతో గణేష్ నిమజ్జన వేడుకలు జరుగుతున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇప్పటికే దీనిపై సమీక్ష చేసి పకడ్బందీగా ఏర్పాట్లు చేశాము…గణనాథుడి ఆశీస్సులతో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగుస్తున్నాయి అన్నారు.
- Advertisement -

