జంట నగరాల పరిధిలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిమజ్జనం నేపథ్యంలో జంటనగరాల పరిధిలో విద్యాసంస్థలు, అన్ని ఆఫీస్‌లకు సెలవులు ప్రకటించారు. ఇక సెప్టెంబర్ 6 …ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 7 ఉదయం 10 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.
నిమజ్జనం రూట్ మ్యాప్ ఇదే..
() సికింద్రాబాద్ నుంచి పాట్నీ–ప్యారడైజ్–రాణిగంజ్–కర్బలామైదాన్–ట్యాంక్‌బండ్ మార్గం
()బాలాపూర్ నుంచి చార్మినార్–అబిడ్స్–లిబర్టీ–ట్యాంక్‌బండ్–నెక్లెస్ రోడ్ ప్రధాన శోభాయాత్ర
()దిల్సుఖ్నగర్, అంబర్పేట్, నారాయణగూడ, ఉప్పల్ నుంచి ప్రాసెషన్లు లిబర్టీ వద్ద కలుస్తాయి
()టోలిచౌకీ, మెహిదీపట్నం నుంచి వచ్చిన విగ్రహాలు ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరతాయి
()తపాచబుత్రా, ఆసిఫ్‌నగర్ నుంచి వచ్చిన విగ్రహాలు ఎంజే మార్కెట్లో కలుస్తాయి
Also Read:TTD:అనంత పద్మనాభ వ్రతం
పార్కింగ్ ప్రదేశాలు: ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్
నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6 ఉదయం 8 నుంచి సెప్టెంబర్ 7 రాత్రి 11 వరకు నగరంలోకి లారీలకు ప్రవేశం లేదు. విమానాశ్రయం వెళ్ళేవారు పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే లేదా ఔటర్ రింగ్ రోడ్ మాత్రమే వాడాలి. ఏదైనా సమస్య ఉంటే హెల్ప్‌లైన్ నంబర్లు: 040-27852482, 8712660600, 9010203626లను సంప్రదించాలని పోలీసులు సూచించారు.

