సెప్టెంబర్ 9న రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జన కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. తాజాగా హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ వద్ద జరుగుతున్న గణేశ్ నిమజ్జనాలు కూడా కార్యక్రమాలు ముగుస్తున్నాయి. భక్తులు మండపాల ఇళ్ల వద్ద ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ ఒక్కొక్కటిగా నిమజ్జనమవుతున్నాయి. గత రెండ్రోజులుగా అమలు చేస్తున్న ట్రాఫిక్ ఆంక్షలను పోలీసులు పాక్షింగా సడలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా సడలించారు. దీంతో ఎన్టీఆర్ మార్గ్‌లో వాహనాలు యథావిధిగా నడుస్తున్నాయి. కొన్ని మార్గాల్లో వాహనాలు అనుమతిస్తుండటంతో ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు మెల్లగా తగ్గుముఖము పడుతున్నాయి. మెల్లగా హుస్సేన్ సాగర్ వద్ద మిగిలిన గణేశ్ విగ్రహాల నిమజ్జనం కూడా పూర్తికావొచ్చింది.
హైదరాబాద్‌లో ఇవాళ ఒక్కరోజే 7335మెట్రిక్ టన్నుల చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించారు. దాదాపుగా 40 జేసీబీలు, 330 వాహనాలతో చెత్తను తరలించే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో 330 వాహనాలకు అదనంగా మరో 97 వాహనాలు మరియు 27 అదనంగా జేసీబీలను కూడా జీహెచ్‌ఎంసీ సిబ్బంది వినియోగిస్తున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన బేబీ పాండ్స్‌లో సూమారుగా 89వేల విగ్రహాలు నిమజ్జనం చేశారని అధికారులు వెల్లడించారు. కాగా వాటి చెత్తను తరలించే పనిలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది సిద్దమయ్యారు. దీంతో మొత్తం చెత్తను తరలించడానికి మరో వారం రోజులు పడుతుందని జీహెచ్‌ఎంసీ అధికారి ఒకరు తెలిపారు.
మొత్తానికి గణేశ్ నవరాత్రులు ముగిశాయి. వాటి చెత్తను తరలించే పనిలో జీహెచ్‌ఎంసీ సిబ్బంది తలమూనకలైంది. వారితో పాటుగా మనం కూడా మన వంతుగా చెత్తను జాగ్రత్తగా తరిలించడానికి వీలుగా జాగ్రత్త చేస్తే సిబ్బందికి పని భారం కొంత వరకు తగ్గుతుందంటున్నారు. కావున మన వంతు సాయంగా చెత్తను జాగ్రత్తగా వారికి ఇస్తే హైదరాబాద్…కాస్త స్వచ్ఛ హైదరాబాద్‌గా మారుతుంది.