ప్రగతి భవన్‌లో గణేష్ ఉత్సవాలు…

555
pragathi bhavan ganesh festival
- Advertisement -

దేశవ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ మహాగణపతి తొలిపూజ అందుకోగా ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.

ప్రగతి భవన్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. మట్టి గణపతి ప్రతిమను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు సీఎం కేసీఆర్ కుటుంబసభ్యులు. కేసీఆర్ దంపతులు, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,ఎంపీ సంతోష్ కుమార్, కేటీఆర్ కుమారుడు హిమాన్షుతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. గణపతి పూజ ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు.

- Advertisement -