బన్నీ డాన్స్ మాస్టర్‌ బాగానే తగ్గాడు..!

310
Ganesh Acharya lost 85 kgs in 1.5 years!
Ganesh Acharya lost 85 kgs in 1.5 years!
- Advertisement -

కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేశ్ ఆచార్య.. బాలీవుడ్‌లో స్టార్ కొరియోగ్రాఫర్.. ఇ చూడ్డానికి భారీగా కనిపిస్తాడు.. డ్యాన్స్‌లు చేయడమే కష్టం.. స్టార్ హీరోల చేత అదిరిపోయే స్టెప్పులు వేయిస్తాడు..  టీవల బన్నీ సినిమా డీజేకు కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేశాడు.. గుడిలో.. బడిలో.. మదిలో.. పాటకు కొరియోగ్రాఫి గణేష్‌ ఆచార్యదే.. ఈ పాటకు ఎంతగా పాపులర్ అయిందో తెలిసిందే.. దాదాపు 200 కిలోల‌ భారీ కాయంతో కనిపించిన కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేశ్ ఆచార్య కొత్తలుక్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు..

త‌న భారీకాయంతో ఏబీసీడీ సినిమాలో ప్ర‌భుదేవాతో క‌లిసి స్టెప్పులేసిన కొరియోగ్రాఫ‌ర్ గ‌ణేశ్ ఆచార్య దాదాపు 200 కిలోల‌ నుండి ఏకంగా 115 కిలోల బరువు తగ్గి 85 కిలోల బరువుకు వచ్చాడు. అంతా బరువు తగ్గడమంటే మాటలు కాదు.. ఈ బ‌రువు త‌గ్గడం వెనుక చాలా క‌ఠోర శ్ర‌మ దాగి ఉంద‌న్నాడు గ‌ణేశ్‌. బ‌రువు త‌గ్గ‌డానికి ప‌డ్డ శ్రమకు తగిన ఫలితం ద‌క్కింద‌ని సంతోషంగా చెబుతున్నాడు గ‌ణేశ్‌.

ganesh acharya

దాదాపు ఏడాదిన్నర కాలం పాటు అనేక ర‌కాలుగా శ్రమించిన తర్వాత త‌న బ‌రువు 85 కిలోల‌కు త‌గ్గింద‌ని చెప్పాడు. గతంలో దాదాపు 200 కేజీల వరకూ బరువు పెర‌గ‌డంతో చాలా ఇబ్బందిప‌డ్డాడ‌ట‌. గ‌తంలో డ్యాన్స్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది ప‌డేవాడిన‌ని, అప్పటికి ఇప్పటికి తేడా స్పష్టంగా తెలుస్తోంద‌ని గ‌ణేశ్ చెప్పాడు. ఇప్పుడు చాలా కంఫర్టబుల్‌గా డ్యాన్స్‌ చేయగలుగుతున్నానని తెలిపాడు. త్వరలోనే త‌న‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌కు సంబంధించిన వీడియోను యూట్యూబ్‌లో పెడతానని చెప్పాడు. భాగ్‌ మిల్కా భాగ్‌ సినిమాలో మస్తాన్‌ కా ఝుండ్‌ పాటకు కొరియోగ్రఫీ చేసిన గ‌ణేశ్ కు జాతీయ అవార్డు ల‌భించిన సంగ‌తి తెలిసిందే. ఇక తనలోని త‌న‌లోని కొత్తదనాన్ని చూపించేందుకు బరువు తగ్గానని చెబుతున్నాడీ కొరియోగ్రాఫ‌ర్‌.

- Advertisement -