Varun Tej:‘గాండీవ‌ధారి అర్జున’..సెన్సార్ పూర్తి

24
- Advertisement -

వైవిధ్య‌మైన జోన‌ర్స్ క‌థాంశాల‌తో సినిమాలు చేయ‌టానికి ఎప్పుడూ ముందుండే హీరోల్లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఒక‌రు. ఈ టాలీవుడ్ స్టార్ ప్ర‌తీ సినిమాకు త‌న విల‌క్ష‌ణ‌త‌ను చూపిస్తూనే వ‌స్తున్నారు. తాజాగా ఈయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన యాక్ష‌న్ అండ్ ఎమోష‌న‌ల్‌ థ్రిల్ల‌ర్ ‘గాండీవ‌ధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు సినిమాను తెర‌కెక్కించారు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌లో గూజ్ బంప్స్ తెప్పించే యాక్ష‌న్ స‌న్నివేశాలను చూసి ప్రేక్ష‌కులు ఆశ్చ‌ర్య‌పోయారు. సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఆగ‌స్ట్ 25న గ్రాండ్ రిలీజ్ చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ట్రైల‌ర్, సాంగ్ రిలీజ్ త‌ర్వాత సినిమాపై ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి.

తాజాగా ‘గాండీవ‌ధారి అర్జున’ సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. 2 గంట‌ల 18 నిమిషాలుగా మేక‌ర్స్ ఈ సినిమా ర‌న్‌టైమ్‌ను లాక్ చేశారు. సినిమాను చూసిన సెన్సార్ స‌భ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఆక‌ట్టుకునే యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌తో పాటు సినిమాలోని మంచి మెసేజ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంద‌ని మేక‌ర్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.

వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. నాజ‌ర్‌, విమ‌లా రామ‌న్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. న‌టీన‌టులు న‌ట‌న‌, సాంకేతిక నిపుణుల ప్ర‌తిభ ప్రేక్ష‌కుల‌కు ఓ అమేజింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. యూనిక్ స్టోరీల‌తో సినిమాల‌ను డైరెక్ట్ చేసే బ్రిలియంట్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ స‌త్తారు త‌న‌దైన పంథాలో ‘గాండీవ‌ధారి అర్జున’ సినిమాను ఎంట‌ర్‌టైనింగ్‌గానే కాకుండా ప్రేక్ష‌కుల‌కు మంచి ప్ర‌భావాన్ని చూపేలా తెర‌కెక్కించారు.

Also Read:ఆమె అల్లు అర్జున్‌తో ప్రేమలో ఉందట

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నిర్మాణ సంస్థ చేసే సినిమాల్లోని ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ గొప్ప‌గా ఉండ‌ట‌మే కాకుండా ప్రేక్ష‌కుల‌కు ఓ గొప్ప థియేట్రిక‌ల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా ఉంటాయి. మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం అందించిన ఈ సినిమాకు ముఖేష్ సినిమాటోగ్రాప‌ర్‌గా అవినాస్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేశారు.

Also Read:ఆ డైరెక్టర్ పరిస్థితి ఇక కష్టమే

- Advertisement -