ఆమె అల్లు అర్జున్‌తో ప్రేమలో ఉందట

19
- Advertisement -

భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తున్న అందాల భామ ఐశ్వర్య లక్ష్మి… ‘గాడ్సే’, ‘అమ్ము’, ‘పొన్నియిన్ సెల్వన్’వంటి చిత్రాలతో ఈ భామ తెలుగు వారికి చేరువైంది. ఈ నటి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించింది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘కింగ్ ఆఫ్ కొత్త’ మూవీలో మంచి పాత్ర పోషించినట్లు పేర్కొంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ పై క్రేజీ కామెంట్స్ చేసింది. స్టైల్‌తో కట్టిపడేసే అల్లు అర్జున్‌ పాన్ ఇండియా హీరోల్లో ఒకరని చెప్పింది.

ముఖ్యంగా అల్లు అర్జున్ అంటే తనకు ఎంతో ఇష్టం అని ఐశ్వర్య లక్ష్మి చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రాకముందు నుంచీ తాను అల్లు అర్జున్ తో ప్రేమలో ఉన్నాను అని, కాకపోతే అది వన్ సైడ్ లవ్ అని చెప్పింది. ఇక ఐశ్వర్య లక్ష్మి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. హోమ్లీ లుక్స్ తో హీట్ పెంచడంలో అమ్మడు తోపు. ఆ మధ్య బ్లాక్ క‌ల‌ర్ లెహంగాలో క‌నిపించి కుర్రాళ్ల‌కు మ‌తి పోగొట్టింది. సూప‌ర్ హాట్ పోజులిచ్చి క్రేజీ లుక్స్ లో కుర్రాళ్ళను కుదిపేసింది.

Also Read:చిరు నిజంగానే పది కోట్లు వెనక్కి ఇచ్చేశారా?

కాకపోతే, ఐశ్వర్య లక్ష్మికి ఆశించిన స్థాయిలో స్టార్ డమ్ రాలేదు. దాంతో ఆమెకు స్టార్ హీరోల సరసన అవకాశాలు రావడం లేదు. రీసెంట్ గా ఐశ్వర్య లక్ష్మికి కాలికి గాయం అయ్యిందని తెలియడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షూటింగ్ సమయంలో ఏదైనా దెబ్బ తగిలిందా.. ? లేదా ఇంట్లోనే ఆమె కాలికి దెబ్బ తగిలిందా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఐశ్వర్య లక్ష్మి, అల్లు అర్జున్ పై క్రేజీ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Also Read:ఐర్లాండ్‌తో టీ20..బుమ్రా రీ ఎంట్రీ

- Advertisement -