పర్యాటక క్షేత్రంగా గండిపేట: కేటీఆర్‌

219
ktr
- Advertisement -

రాబోయే రెండు సంవత్సరాల్లో గండిపేటను రూ. 100 కోట్లతో పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు మంత్రి కేటీఆర్. రంగారెడ్డి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన కేటీఆర్.. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్‌ కమిట్‌మెంట్ ఉన్న నాయకుడు అని కొనియాడారు. బలహీనవర్గాల నాయకుడు కాబట్టే పేదల కష్టాలు తెలుసన్నారు.

రాజేంద్రనగర్‌ నియోజకవర్గంలో కనివిని ఎరుగని రితీలో అభివృద్ధి జరిగితీరుతుందన్నారు. త్వరలో 350 ఎకరాల్లో 28 ఐటీ కంపెనీలకు స్థలం ఇవ్వబోతున్నామని లక్షా 20 వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పారు.

గండిపేట చెరువు కట్టి వందేళ్లు నిండుతున్న సందర్భంగా పర్యాటకక్షేత్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అభివృద్ధిలో రాజేంద్రనగర్ దూసుకుపోతుందన్నారు. రూ. 166 కోట్లతో మూసీ సుందరీకరణ చేపట్టామన్నారు. రైతుబంధుతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అన్నదాత లేనిదే మనకు బ్రతుకు లేదన్నారు. వ్యవసాయంలో నూతనశకం ప్రారంభమైందన్నారు.

కాంగ్రెస్ పేదవారి గురించి ఏనాడు ఆలోచింలేదన్నారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చింది పేదవారి కన్నీళ్లు తూడవడానికే అన్నారు. సంక్షేమం కోసం రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్,ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు కేటీఆర్.

- Advertisement -